NTV Telugu Site icon

Womens T20 World Cup 2024: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా.. ఎవరు గెలిచినా చరిత్రే..

Womens T20 World Cup 2024

Womens T20 World Cup 2024

Womens T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తొలిసారి ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది. వెస్టిండీస్‌ను ఓడించి న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో అడుగు పెట్టగా, దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుంది. సెమీ-ఫైనల్లో న్యూజిలాండ్ వెస్టిండీస్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు రెండు జట్లూ అటు పురుషులు, ఇటు మహిళలు ప్రపంచ కప్ ను గెలవలేకపోయాయి. ఇందులో గెలిచిన జట్టు తొలిసారిగా టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది.

Read Also: Karthi : ఓటీటీలో ‘సత్యం సుందరం’..ఎప్పుడు ఎక్కడంటే..!

ఈ మహిళల T20 ప్రపంచ కప్ UAEలో అక్టోబర్ 3న ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. ఈ క్రమంలో 2009 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా లేకుండా ప్రపంచకప్ ఫైనల్ ఆడనుంది. ఆస్ట్రేలియా జట్టు ఈ ట్రోఫీని అత్యధికంగా 6 సార్లు గెలిచింది. ఇకపోతే ప్రస్తుత టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టి20 ప్రపంచ కప్‌లోకి ప్రవేశించడానికి ముందు, ఈ జట్టు 2024 సంవత్సరంలో ఆడిన 13 T20 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. దీని తర్వాత, ప్రపంచకప్‌లో వారి ప్రదర్శన చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ టీమ్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి చరిత్ర సువర్ణ పుటల్లో పేరు నమోదు చేసుకునేందుకు సోఫీ డివైన్ జట్టుకు సువర్ణావకాశం దక్కింది.

Read Also: RBI Internship 2025: కళాశాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందిస్తున్న ఆర్బీఐ.. రూ.20,000 స్టైపెండ్ కూడా

ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. వారిని ‘చోకర్స్’ అంటారు. ఎందుకంటే ఈ జట్టు పెద్ద మ్యాచ్‌లలో ఓడిపోతుంది. ఈ ట్యాగ్ పురుషుల, మహిళల జట్టులకు సరిగ్గా సరిపోతుంది. దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అయితే, టైటిల్ గెలవడం ద్వారా ఈ అపోహను బద్దలు కొట్టే గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు మహిళల జట్టుకు దక్కింది.

Show comments