బంగారం ధరలేమో భగ్గుమంటున్నాయి. కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ బంగారం కొనేందుకు షాప్ కు వెళ్లి చేతివాటం ప్రదర్శించింది. కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా అనుకుందో ఏమోగాని మొత్తానికి రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కాజేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో చోటు చేసుకుంది.
Also Read:AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..!
గోల్డ్ షాప్ కు వెళ్లిన ఓ జంట ఆభరణాలు చూసే సమయంలో యజమాని కళ్లుగప్పి రూ.లక్షల విలువైన నెక్లెస్ ను కొట్టేసింది. షాప్ ఓనర్ ఆభరణాలను చూపిస్తుండగా ఓ నెక్లెస్‌ను మహిళ ఎవరికీ అనుమానం రాకుండా తన చీర కొంగు కింద దాచిపెట్టింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, స్టాక్ తనిఖీల సమయంలో ఆభరణాలు మిస్ అయినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా మహిళ నెక్లెస్ ను కాజేసినట్లు తేలింది.
Also Read:MP Mithun Reddy: ఒక ఉగ్రవాదిలా నన్ను జైల్లో పెట్టారు.. సీసీ కెమెరా పెట్టి విజయవాడ నుంచి చూశారు..!
దీంతో దుకాణం యజమాని గౌరవ్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన నెక్లెస్ విలువ దాదాపు రూ.6 లక్షల ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నెక్లెస్ దొంగిలించిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవల బెంగళూరులో ఓ మహిళ చీరలను దొగిలించిందని షాప్ యజమాని దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మహిళతో పాటు షాప్ యజమానిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
बुलंदशहर पंडित ज्वेलर्स के शो रूम से ऐसे चोरी हुआ लाखों का सोने का हार pic.twitter.com/nY16caNWUs
— Shah Nawaz journalist (News 24) (@Shahnawazreport) September 30, 2025
