ఇప్పటి జనరేషన్ జనాలు చాలా బిజీ లైఫ్ కు అలవాటై పోయారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడుతూ.. పక్కవారిని పట్టించుకోవడం లేదు. అసలు ఇంట్లో వాళ్లనే పట్టించుకోనంత బిజీ అయిపోయారు. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ మెట్రోలో అమ్మకు అవమానం జరిగింది. ఓ బాలింత, పసికందుతో పాటు మెట్రో ఎక్కింది. మెట్రోలోని సీట్లు ఫుల్‌గా ఉండడంతో.. చేసేదేమి లేక నేలపై కూర్చుంది. ఆమె రావడం కూర్చోవడం అందరూ చూశారు. కానీ ఎవరూ ఆమెకు సీటివ్వలేదు. అమ్మకు సీటిచ్చేందుకు ఎవ్వరికీ మనసు రాలేదు.పసికందుతో నేలపై కూర్చోవడం ఎంత కష్టమో మహిళలందరికీ అనుభవమైన విషయమే. కానీ.. తమ కుటుంబసభ్యులు కాదు కదా అన్న ఒకే ఒక్క కారణంతో మానవత్వాన్ని సైతం మరిచి ప్రవర్తించారు. అంతేకాదు.. మొబైల్ ఫోన్లు చూసుకుంటూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ మెట్రోలో అమానుషం : బాలింతకు సీటు ఇవ్వని జనాలు.. !
