Site icon NTV Telugu

Beauty With Talent: ఈ అమ్మాయి ఏంట్రా బాబు.. ఇంత సులువుగా పాములను పట్టేస్తోంది..

Viral

Viral

Beauty With Talent: కొంతమంది అమ్మాయిల్లో అందం ఉంటే.. తెలివి ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి అమ్మాయిలకు అందంతో పాటు తెగువ కూడా ఎక్కువే. ఏదైనా విషయంలో గనుక తేడా వచ్చిందంటే.. వారి తాట తీస్తారు. ఇకపోతే మనలో చాలామందికి పాములంటే భయమే. మరికొందరైతే పాములను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. ఇకపోతే ఓ యువతి మాత్రం.. ఎంటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పొడవాటి విషసర్పాలని ఇట్టే పట్టేస్తుంది. దాంతో తనకి అందంతో పాటు ధైర్యం కూడా తనలో ఉందని నిరూపించింది అమ్మాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Jammu Kashmir : కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ.. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ?

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సైబా అనే అమ్మాయి ఓ ఇంట్లో దాగి ఉన్న ర్యాట్ స్నేక్‌ ను కేవలం చేతులతో పట్టుకుని బయటకు తీసింది. ఆ తర్వాత పాముతో కలిసి రకరకాల ఫోటోలు దిగింది. భయంతో గ్రామస్థులు పామును పట్టుకునేందుకు వెళ్లి పామును సంచిలో వేసుకుని గ్రామానికి దూరంగా ఉన్న అడవిలో వదిలేశారు. ఓ యువతిని ఇంత ధైర్యంగా పామును పట్టుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై రకరకాల కామెంట్లతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Exit mobile version