Site icon NTV Telugu

Woman Locked Police Station: విశాఖలో పోలీస్‌ స్టేషన్‌కే తాళం వేసిన మహిళ.. స్పృహ కోల్పోయిన సీఐ..!

Ps

Ps

Woman Locked Police Station: ఎవరైనా సమస్య వస్తే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తారు.. ఇది నా సమస్య.. దీనిని వెంటనే పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తారు.. అయితే, కొందరు పోలీసుల నిర్లక్ష్యం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చేలా తయారైంది.. తన మస్య పరిష్కారం కోసం ఐదు రోజులుగా పీఎస్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటో విసుగు చెందిన ఓ మహిళా.. ఏ కంగా ఆ పోలీస్‌ స్టేషన్‌కే తాళం వేసింది.. ఈ ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

Read Also: Rathod Bapu Rao: 20న బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తా…21 న కాంగ్రెస్‌లో చేరుతా

ఏపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని పెందుర్తిలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ గత ఐదారు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది.. తన సమస్యను పరిష్కరించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.. నా ఇంటికి తాళం వేశారు.. నేను రోడ్డుపై పడ్డాను.. కనీసం బాత్‌రూమ్‌ కూడా లేకుండా పోయిందన్న ఆమె.. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని.. ఐదారు రోజులుగా తిరుగుతున్నా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కూడా తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.. సీపీ ఆఫీసుకు వెళ్తే అక్కడికి వెళ్లొద్దు అంటారు.. పీఎస్‌కు వస్తే న్యాయం చేయడం లేదంటున్నారు. దీంతో విసుగుచెందిన ఆ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ కే తాళం పెట్టింది.. ఊహించని ఘటనతో షాక్‌ తిన్న పోలీసులు.. ఆ మహిళకు నచ్చజెప్పి.. మొత్తానికి తాళం తీశారు.. అయితే, తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని పోలీసులను హెచ్చరించింది ఆ మహిళ.. మరోవైపు.. పెందుర్తి పోలీసు స్టేషన్ కి తాళంవేసిన ఘటనతో అవాక్కయిన సీఐ శ్రీనివాసరావు.. భయంతో స్పృహ కోల్పోయారు.. దీంతో.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మొత్తంగా ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version