Site icon NTV Telugu

Woman Fined: ఇంటికి రంగు వేసిందని.. మున్సిపల్ వాళ్లు రూ.19లక్షల ఫైన్ వేశారు

Door

Door

Woman Fined: ఎవరికైనా తమ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఉంటుంది. అందరి కంటే తమ ఇళ్లు మెరిసిపోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన ఇంటికి పెయింటింగ్ వేయించింది. ఇప్పుడు అదే ఆమెకు సమస్య కొని తెచ్చింది. అది ఏంటంటే ఆ మహిళ తన ఇంటి ఫ్రంట్ డోర్‌కు పింక్ కలర్ వేయడమే. అందుకు మున్సిపల్ వాళ్లు ఆమెకు అక్షరాల రూ.19 లక్షలు జరిమానా వేశారు. ఈ విచిత్రమైన ఘటన స్కాట్‌లాండ్‌లో జరిగింది.

Read Also: Two-Finger Test Ban: లైంగిక దాడి కేసుల్లో ‘టూ ఫింగర్ టెస్ట్’ బ్యాన్ చేసిన సుప్రీంకోర్టు

ఎడిన్‌బ‌ర్గ్‌కు చెందిన మిరిండా డిక్సన్ త‌న ఇంటికి ఉన్న ఫ్రంట్ డోరుకు పింక్ రంగు వేసుకుంది. అయితే ఆ రంగు వేసినందుకు ఆ న‌గ‌ర మున్సిపాలిటీ ఆమెకు 19 లక్షల రూపాయలు ఫైన్ వేసింది. ఇంటి ముందు డోరుకు ఆ క‌ల‌ర్ వేయడాన్ని స్థానిక మున్సిపాల్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిటీ కౌన్సిల్ ప్లాన‌ర్స్ పింక్ కలర్ డోర్‌ను మార్చాలని సూచించారు. 2019లో మిరిండా డిక్సన్‌ కు ఆ ఇల్లు తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చింది. అయితే ఆ ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేయించింది. అందులో భాగంగా ఫ్రంట్ డోర్‌కు తనకు ఇష్టమైన పింక్ కలర్ వేయించింది.

Read Also: chocolate steal: చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య

ఆ లైట్ పింక్ కలర్ వేయడం వల్ల ఆ డోర్ చాలా ఫేమస్ అయింది. చాలామంది ఆ వీధిలో వెళ్తూ ఆ డోర్ దగ్గర నిలబడి ఫోటోలు, వీడియోలు తీసుకునేవారు. తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పింక్ డోర్ వైరల్ అయింది. అయితే నగరంలో ఉండే రూల్స్ ప్రకారం ఇంటి ముందు డోర్లకు కేవ‌లం వైట్ క‌ల‌ర్ మాత్రమే వేయాలి. దాంతో మున్సిపాలిటీ అధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్ రంగు మార్చాల‌ని ఆదేశించారు. ఒక‌వేళ ఇంటి డోర్‌కి వైట్ క‌ల‌ర్ వేయకపోతే.. 20 వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.19 లక్షలు జరిమానా చెల్లించాలని హెచ్చరించారు.

Exit mobile version