ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్‌లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది. వాస్తవానికి.. ఇండోర్‌లోని హోరా కుటుంబానికి చెందిన కోడలు హర్‌ప్రీత్ కౌర్ హోరా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించింది. హర్‌ప్రీత్ లండన్‌లో క్లౌడ్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న తన భర్త రాబీ హోరాను కలవడానికి లండన్ వెళుతోంది. జూన్ 16న రాబీ పుట్టినరోజు కావడంతో హర్‌ప్రీత్ ముందుగానే అక్కడ ఉండాలని ప్లాన్ చేసుకుని బయలు దేరింది. కానీ ఈ ప్రమాదం ఆమె కుటుంబానికి విషాదాన్ని మిగిలించింది.
READ MORE: Chirla Jaggireddy: అవినీతి గిన్నిస్ బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయి..!
వాస్తవానికి.. హర్‌ప్రీత్ కౌర్ తన తల్లిని కలవడానికి కొన్ని రోజుల క్రితం లండన్ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఆమె జూన్ 19న లండన్ వెళ్లాలను కుంది. కానీ జూన్ 16న తన భర్త రాబీ పుట్టినరోజు కోసం, జూన్ 12న వెళ్లాలని నిర్ణయించుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే మేఘనినగర్ ప్రాంతంలో విమానం కూలిపోవడంతో హర్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆమె కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
