Palnadu: పల్నాడు జిల్లాలో సివిల్ సెటిల్మెంట్ లో పోలీసులు జోక్యం చేసుకోవడమే కాకుండా.. మహిళను ఇష్టం వచ్చినట్లు దూషించడంతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్లకు చెందిన శ్రీనివాసరావు ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో అప్పులవాళ్లు శ్రీనివాసరావు కుటుంబంపై వత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు ఎంటరయ్యారు. శ్రీనివాసరావుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
అక్కడ పోలీసులు అప్పుల సంగతి అడగడంతోపాటు.. బాకీదారులకు ఆస్తులు రాయించారు. అయినా ఇంకా బాకీ మిగలింది. బాకీ డబ్బులకోసం పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు శ్రీనివాసరావు భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. స్టేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో మనస్తాపానికి గురైన మహిళ జ్యోతి చేయి కోసుకుంది. దీంతో పోలీసులు వెంటనే జ్యోతిని ఆసుపత్రికి తరలించారు. అయితే తన పరువు పోయిందని చికిత్స చేయించుకునేందుకు మహిళ నిరాకరించింది. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడమే కాకుండా మహిళనని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆమె వాపోతుంది.
