Lady Blackmailer: ఫేస్‌బుక్ వేదికగా ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి నెమ్మదిగా వారితో మాట కలుపుతుంది. కాస్త స్నేహం కాగానే తీయని మాటలతో మాయ చేస్తుంది. ఆమె వలపు వలలో పడిన బాధితులు ఆమె చెప్పేవన్ని నిజాలనుకుని నమ్మేస్తారు. సన్నిహిత పరిచయాలు పెంచుకుంటుంది. అలా వారిని మచ్చిక చేసుకున్న తర్వాత.. వారిని అతిధులుగా ఆహ్వానిస్తుంది. అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఇలా చాలా మంది ప్రముఖులను మోసం చేసిన మాయలాడిని భువనేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ ఇలా ఎంతో మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫేస్‌బుక్‌లో ప్రముఖులను పరిచయం చేసుకుని వారితో సన్నిహితంగా మెలుగుతుంది. ఆ మహిళ తనను తాను లాయర్ అని పరిచయం చేసుకుంటుంది. వారిని అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలతో బెదిరించడంలో ఆ మహిళ ఆరితేరినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. నిందితురాలికి ఇదివరకే వివాహమైనట్లు, ఆమె భర్త సహకారంతోనే ప్రముఖులను ముగ్గులోకి దింపుతున్నట్లు ఆరోపణ ఉంది. మాజీ మంత్రులు, నాయకులు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఖండగిరి పోలీస్ ఠాణాలో ఫిర్యాదు నమోదు కావడంతో డొంక కదిలింది.
Indo American: కొడుక్కి విడాలిస్తానన్న కోడల్ని వెతికి మరీ చంపిన మామ
ధనవంతులతో స్నేహం చేస్తూ వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్న సదరు మహిళ.. ఇటీవలే భువనేశ్వర్‌లోని లక్ష్మీసాగర్ పోలీసులకు తనపై ప్రముఖ ఒడియా సినీ నిర్మాత లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఆ మహిళ తన వాదనలకు మద్దతుగా కొన్ని ఫొటోలను కూడా సమర్పించింది. ప్రముఖ ఒడియా సినీ నిర్మాత ఆమె వాదనలను ఖండించారు.చ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కూడా చెప్పడం గమనార్హం. ప్రముఖ ఒడియా సినీ నిర్మాత భువనేశ్వర్‌లోని నాయపల్లి పోలీస్ స్టేషన్‌లో అమ్మాయి తనను బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ కౌంటర్ ఆరోపణ చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ యువతి తనను బ్లాక్ మెయిల్ చేసి 3 కోట్ల వరకు డబ్బులు అడిగిందని చెప్పాడు. దీర్ఘకాలంగా విచారణకు సహకరించనందున ఆమెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె ముందస్తు బెయిల్ కోసం ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు.