Site icon NTV Telugu

With Love : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “విత్ లవ్”..

With Love Ott

With Love Ott

కోలీవుడ్‌లో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాతో మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అబీషీన్ జీవింత్ హీరోగా నటించిన తాజా చిత్రం “విత్ లవ్”. ఈ సినిమాలో ‘ఛాంపియన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. థియేటర్లలో క్లీన్ ఎంటర్టైనర్‌గా మంచి స్పందన లభించిన ఈ క్యూట్ రోమ్-కామ్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అయితే..

Also Read : Sandeepa Virk :తీహార్ జైల్లో నరకం చూశాను.. గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది

తాజా సమాచారం ప్రకారం, ‘విత్ లవ్’ చిత్రం మార్చి 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, ఈ సినిమా కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లోనూ అందుబాటులోకి రాబోతోంది. సీన్ రోల్డన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఎం ఆర్ పి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకునే వారు మరికొన్ని రోజులు ఆగితే నెట్‌ఫ్లిక్స్‌లో దీనిని ఆస్వాదించవచ్చు.

Exit mobile version