Site icon NTV Telugu

Made In India: దేశంలో మొట్టమొదటి డ్రైవర్‌లెస్ కార్ ఆవిష్కరణ.. (వీడియో)

Driverless Car

Driverless Car

టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని డ్రైవర్ లెస్ కార్లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు నమూనాను ఆవిష్కరించాయి. దీనికి WIRIN (Wipro-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్) అని పేరు పెట్టారు. ఈ కారు పూర్తిగా భారత్ లో అభివృద్ధి చేయబడిన టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. డ్రైవర్ లెస్ కారుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ ఈ డ్రైవర్ లేని కారులో కూర్చుని ఉండటం చూడవచ్చు. వీడియోలో, కారు కళాశాల క్యాంపస్‌లో డ్రైవర్ లేకుండా సజావుగా ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. ఇది పూర్తిగా దేశీయ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా రూపుదిద్దుకుంది. ఈ నమూనాను అక్టోబర్ 27న RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఆవిష్కరించారు. విప్రో గ్లోబల్ హెడ్ (అటానమస్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్) రామచంద్ర బుధిహాల్, RSST అధ్యక్షుడు M.P. శ్యామ్, RVCE ప్రిన్సిపాల్ K.N. సుబ్రమణ్య హాజరయ్యారు. ఈ కారు RV కళాశాల అధ్యాపక సభ్యులు ఉత్తర కుమారి, రాజా విద్య నేతృత్వంలోని ఆరు సంవత్సరాల పరిశోధన, అభివృద్ధి ఫలితంగా రూపుదిద్దుకుంది.

నివేదికల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, రాబోయే నెలల్లో అధికారికంగా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. అన్ని రకాల రోడ్లు, వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన ప్రయాణం ఉండేలా, భారతీయ రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులను మ్యాపింగ్ చేయడంపై ఈ బృందం ప్రస్తుతం పని చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version