Site icon NTV Telugu

Cholesterol Rise: చలికాలంలో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్.. నియంత్రించడానికి ఆహారంలో ఇవి చేరిస్తే సరి..!

Cholesterol

Cholesterol

Cholesterol Rise: చలికాలం రాగానే శరీరానికి మరింత శ్రద్ధ, సంరక్షణ అవసరం అవుతుంది. చలి రోజులలో చాలా మందికి వారి ఆరోగ్య విషయంలో, రోజువారీ దినచర్యలో మార్పులు వస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వాటిలో ఒకటి కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం. ఇది గుండె ఆరోగ్యానికి ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. చల్లని వాతావరణంలో ఆహారపు అలవాట్లు, దినచర్య, శరీర పనితీరులో మార్పులు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా శీతాకాలంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఎక్కువ అవుతుంది.

Sugar Level Symptoms: షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయంటే..?

చలికాలంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరం కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. అలసట, ఛాతీలో భారంగా అనిపించడం, శరీరంలో నీరసం పెరగడం, శ్వాస ఆడకపోవడం, పాదాలలో నొప్పి, మెడ లేదా భుజాలలో బిగుతు, తలనొప్పి లేదా తల భారీగా అనిపించడం వంటి సంకేతాలు శరీరంలో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయని సూచిస్తాయి. వీటిని సకాలంలో నియంత్రించడం చాలా అవసరం.

India – US: పాకిస్తాన్ పొగడ్తలు, ఖతార్ డబ్బుకు ట్రంప్ పడిపోయాడా.? భారత్-యూఎస్ మధ్య ఉద్రిక్తతలకు ఇదే కారణమా?

ఇకపోతే చలికాలంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటన్న విషయానికి నిపుణులు ఏమంటున్నారంటే.. శీతాకాలంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని.. అందులో నెమ్మదైన జీవక్రియ, శారీరక శ్రమ లేమి, అధిక కేలరీల ఆహారం, హార్మోన్ల మార్పులు, విటమిన్ డి లోపం వంటివి కొలెస్ట్రాల్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. కాబట్టి చలికాలంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి తేలికపాటి పోషకాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఇందులో ఓట్స్ (Oats), మల్టీగ్రెయిన్ ధాన్యాలను ఆహారంలో చేర్చండి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బాదం (Almonds), అక్రోట్ (Walnuts) వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇంకా అవిసె గింజలు (Flaxseeds), చియా గింజలు, గుమ్మడి గింజలలో ఒమేగా-3 (Omega-3) కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. వంట కోసం ఆలివ్ నూనె (Olive Oil) లేదా ఆవ నూనె (Mustard Oil) వంటివి మంచి ఎంపికలుగా పరిగణించవచ్చు.

Exit mobile version