NTV Telugu Site icon

Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..

Wine Band Telangana

Wine Band Telangana

Liquor Shops Closed: మద్యం ప్రియులకు ఇది కాస్త చేదు వార్తే. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు మూసివేయనున్నారు. మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ వ్యాప్తంగా నాన్‌ ప్రాప్రయిటరీ లేని క్లబ్బులు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులను మూసివేయనున్నట్లు సీపీ కోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జులై 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని వైన్ షాపులు బంద్ చేయనున్నారు. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అంటే సోమవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలిపారు. .

Read also: Telangana Assembly 2024: నాల్గవ రోజు అసెంబ్లీ సమావేశాలు.. నేడు బడ్జెట్‌ పద్దుపై చర్చ..

ముఖ్యంగా నగర సౌత్ జోన్‌లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, ఫలక్ నుమా, మొగల్‌పురా, చైటినాక, శాలిబండ, మీర్‌చౌక్‌, డబ్బీర్‌పుర ప్రాంతాల్లో 28న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, వైన్‌షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, మద్యం విక్రయ కేంద్రాలను మూసివేస్తున్నట్లు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. కల్లు దుకాణాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఆషాడమాసం ప్రారంభం నుంచి నగరంలో బోనాల పండుగ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

ట్రాఫిక్ మళ్లింపు..

ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల గుండా యాత్ర కొనసాగుతుంది. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. వాహనాలను కూడా ఆయా మార్గాల్లో మళ్లిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాతబస్తీలోని వివిధ ప్రాంతాల గుండా యాత్ర కొనసాగుతుంది. వాహనాలను కూడా ఆయా మార్గాల్లో మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. లాల్ దర్వాజ బోనాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వైన్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం జూలై 28 (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుంది.
Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..