NTV Telugu Site icon

Wine Shop Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఈనెల 25న వైన్ షాపులు బంద్

Wine Shop Band

Wine Shop Band

Wine Shop Closed: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. మద్యం షాపులు, బార్లు, పబ్బులు కొన్ని గంటల పాటు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆ ఒక్కరోజు కూడా మద్యం దొరకదు. ఎందుకంటే ఆ రోజు హోలీ పండుగ కారణంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులను మూసివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే కల్లు దుకాణాలు కూడా మూసివేయబడతాయి. హోలీ సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు బంద్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొన్ని మాత్రమే అనుమతించబడతాయి. స్టార్ హోటల్స్ మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉంది. ఈ మేరకు ఆయా పోలీసు కమిషనరేట్ల కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: APMS Entrance: ‘ఇంటర్’ ప్రవేశాల కొరకు ఏపీ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ జారీ..!

నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మద్యం షాపులను ఎందుకు మూసివేస్తున్నారో హోలీకి తెలుసా? అంటూ దానికి గల కారణాలు తెలిపారు. పండుగ సమయంలో స్నేహితులు, బంధువులందరూ మద్యం సేవించి గొడవలు, వివాదాలకు దారి తీయకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ హోలీ పండుగ సందర్భంగా మద్యం షాపుల బంద్‌తో పాటు పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు కూడా చేశారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులపై బలవంతంగా రంగులు వేయకూడదని, ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. రోడ్లపై బైక్‌లు నడుపుతూ అరాచకాలు సృష్టించవద్దని హెచ్చరించారు. పండుగల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Gold Price Today : తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Show comments