Site icon NTV Telugu

Liquor Shops Closed: మద్యం ప్రియులకు షాక్.. రెండ్రోజుల పాటు వైన్ షాప్స్ బంద్

Win And Beer Shops

Win And Beer Shops

Wine shops bandh in Hyderabad for two days: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వచ్చే ఆదివారం హైదరాబాద్‌లో బోనాల పండుగ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూలై 16, 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు తెరవరాదని.. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో జూలై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్‌. అలాగే సౌత్ జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం నుంచి అమలులోకి రానున్న ఈ ఉత్తర్వులు 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. మద్యం షాపులను నిర్దేశించిన సమయాల్లోనే మూసివేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read also: Neha Malik Pics: పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న నేహా మాలిక్.. హాట్ పిక్స్ వైరల్!

భాగ్యనగరంలో ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. బోనాల పండుగ సందర్భంగా జంటనగరాల్లో ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్‌ చేయనున్నారు. దీన్ని ఈ రెండు రోజుల పాటు అమలు చేయాలని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో జంటనగరాల్లో జరిగే జాతరలు వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు రోజులు బంద్ పాటించాలని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

వైన్ షాపులతో పాటు మద్యం అందించే బార్లు, క్లబ్బులు, పబ్బులను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలన్నీ పూర్తిగా బంద్ కానున్నాయి. బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని వైన్ షాపులను మూసివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి తగాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు మహంకాళి పీఎస్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూంను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. దాదాపు 5 లక్షల మంది బోనాలు సమర్పిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Big Breaking: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

Exit mobile version