కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windfall Tax Hiked: అంతర్జాతీయ ముడి చమురు (Crude Oil) ధరల్లో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) లేదా విండ్‌ఫాల్ ట్యాక్స్ (Windfall Tax)ను మరోసారి పెంచింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంచారు. అంటే ఒక్కసారిగా రూ.10 పెంపు చేశారు. అలాగే పెట్రోల్ ఎగుమతులపై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.2.5 నుంచి రూ.3.5కు పెంచారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఇంధనంపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.14.5 నుంచి రూ.22కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Also Read
- Udhayanidhi Stalin Arrest: నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
పశ్చిమ ఆసియా (West Asia)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. దీంతో ఇంధన ఎగుమతులపై కంపెనీలకు లాభాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, ATF అందుబాటును మెరుగుపరచడం, అధిక ఎగుమతులను నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచినట్లు తెలిపింది.
ఇదివరకు జూలై 16న కూడా కేంద్ర ప్రభుత్వం కూడా విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు చేసింది. అప్పుడు డీజిల్‌పై ట్యాక్స్‌ను రూ.15.5కు పెంచింది. ATFపై రూ.14.5కు పెంచింది. ఇంకా పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని రూ.2.5కు తగ్గించింది.అంతకుముందు జరిగిన సవరణలో పెట్రోల్‌పై ట్యాక్స్‌ను రూ.4కు పెంచగా.. డీజిల్‌పై విధించే సుంకాన్ని తగ్గించారు. అలాగే ATFపై కూడా ట్యాక్స్‌లో మార్పులు చేశారు.
తాజావార్తలు
-
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
-
Meenakshi Choudhary : 29 ఏళ్ల ఏజ్ గ్యాప్ హీరో సరసన హీరోయిన్గా నటిస్తున్న మీనాక్షిచౌదరి
-
Theatre Releases:ఈ వారం థియేటర్లలో సౌత్ జాతర.. హారర్ నుంచి యాక్షన్ వరకు సందడే సందడి!
-
Sachin Tendulkar Fielding: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జెర్సీలో బరిలోకి దిగిన సచిన్.. ఈ షాకింగ్ విషయం తెలుసా?
-
Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటతో చేతులు గరుకుగా మారాయా? ఇలా చేస్తే మళ్లీ మెత్తబడతాయి.!
-
ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్‌తో వచ్చేస్తున్న Neo 11S.!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!