NTV Telugu Site icon

Wimbledon Final 2023: వింబుల్డన్‌ ఫైనల్లో ఓడిన జొకోవిచ్‌.. ఛాంపియన్‌గా యువ సంచలనం అల్కరాస్‌!

Carlos Alcaraz

Carlos Alcaraz

Carlos Alcaraz Won Wimbledon 2023 Men’s Singles Final After Crush Novak Djokovic: వింబుల్డన్‌ 2023లో యువ సంచలనం కార్లోస్‌ అల్కరాస్‌ విజేతగా నిలిచాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్‌ టైటిల్‌ను స్పెయిన్‌ కుర్రాడు సొంతం చేసుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్‌సీడ్‌ అల్కరాస్‌ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్‌ జకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో.. తొలి సెట్‌ ఓడినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న అల్కరాస్‌ గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

వింబుల్డన్‌ 2023 ఫైనల్లో కార్లోస్‌ అల్కరాస్‌ తొలి సెట్‌ ఓడిపోయాడు. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు గెలిచాడు. ఇక అల్కరాస్‌ విజేతగా నిలిచేలా కనిపించాడు. ఈ సమయంలో నొవాక్‌ జొకోవిచ్‌ విరామం తీసుకుని.. కోర్టులో తాజాగా అడుగుపెపెట్టాడు. తన అనుభవాన్ని ఉపయోగించి అల్కరాస్‌ జోరుకు కళ్లెం వేసి నాలుగో సెట్‌ గెలిచాడు. దాంతో స్కోరు 2-2తో సమమైంది. ఇద్దరు దూకుడుగా ఆడడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.

Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

అయిదో సెట్‌లో ముందుగా గేమ్‌ సాధించిన జొకోవిచ్‌.. ఆపై మరో గేమ్‌ నెగ్గి 4-2తో ఆధిపత్యం చలాయించాడు. ఇక అల్కరాస్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా జకో తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి సెట్‌ దక్కించుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక అయిదో సెట్‌కు వెళ్లింది. కీలకమైన ఈ సెట్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రేపింది. తొలి గేమ్‌లో జొకోవిచ్‌, రెండో గేమ్‌లో అల్కరాస్‌ సర్వీస్‌ నిలబెట్టుకున్నారు. కానీ మూడో గేమ్‌లో జకో సర్వీస్‌ను అల్కరాస్‌ బ్రేక్‌ చేశాడు. ఆపై తన సర్వీస్‌ నిలబెట్టుకున్న అల్కరాస్‌ 3-1తో ఆధిక్యం సాధించాడు. ఐదవ గేమ్‌లో గెలిచి జకో 2-3తో నిలిచినప్పటికీ.. వెంటనే గేమ్‌ నెగ్గి అల్కరాస్‌ 4-2తో నిలిచాడు. అల్కరాస్‌ తన సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ సాధించాడు.

2022లో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన కార్లోస్‌ అల్కరాస్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. మరోవైపు ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న జొకోవిచ్‌.. వింబుల్డన్‌ తుది మెట్టుపై బోల్తాపడ్డాడు. ఈ ఓటమి జకోకు ఏమాత్రం మింగుడుపడకపోవచ్చు. ఇక వింబుల్డన్‌ విజేత అల్కరాస్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్‌ జొకోవిచ్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.

Also Read: Chiru Leaks: భోళాశంకర్ సినిమా నుంచి చిరు లీక్స్.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..

Show comments