Nazriya : ఫాహద్ ఫాజిల్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్
- భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్
- కెమెరా ముందు ఫాహద్ అలా మారుతాడన్న నజ్రియా
- పుష్ప 2లో విశ్వరూపం చూపించాడని కితాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nazriya : దక్షిణాదిలోని ఉన్న విలక్షణ నటుల్లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. మలయాళంలో సోలోగా సినిమాలు చేస్తూనే మరో పక్క తెలుగు, తమిళ భాషల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకుంటున్నారు. తెలుగులో పుష్ప 1 తో ప్రేక్షకులకు దగ్గరైన ఫాహద్ ఫాజిల్ తమిళ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫాహద్ ఫాజిల్ ఒక పాత్ర ఎంచుకున్నాడంటే అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఇది చాలా సినిమాల్లో ఆయన ప్రూవ్ చేశారు. కథ, కథనాలు ఎలా ఉన్నా ఫాహద్ ఫజిల్ పాత్ర వరకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఐతే ఫాహద్ లోని ఒక స్పెషల్ క్వాలిటీని బయట పెట్టింది ఆయన భార్య సౌత్ స్టార్ హీరోయిన్ నజ్రియా. హీరోయిన్ గా మంచి ఫాం కొనసాగిస్తున్న టైం లోనే ఫాహద్ ఫజిల్ తో ప్రేమ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఐతే ఆఫ్ స్క్రీన్ ఫాహద్ ఎంత బాగా తెలిసినా ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్తే అతను వేరేలా కనిపిస్తాడంటూ చెప్పుకొచ్చింది.
Read Also:Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. అయ్యప్ప దర్శనానికి 10గంటల సమయం
Also Read
ఇటీవల నజ్రియా నటించిన సూక్ష దర్శిని ప్రమోషన్స్ లో భర్త ఫాహద్ ఫాజిల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఫాహద్ ఒక మంచి నటుడని.. ఐతే తామిద్దరం కలిసి బెంగళూరు డేస్ కన్నా ముందు నటించాల్సి ఉన్నా తన ట్వెల్త్ ఎక్సామ్స్ ఉండడం వల్ల ఆ అవకాశం వదులుకోవాల్సి వచ్చిందన్నారు. బెంగళూరి డేస్ కన్నా ముందు ఫాహద్ నటించిన ఆర్టిస్ట్ సినిమాలో ఛాన్స్ వచ్చినా తాను చేయలేకపోయానని చెప్పింది. ఆ సినిమా తర్వాత బెంగళూరు డేస్ లో మాత్రం తనకు అవకాశం వచ్చిందని.. ఆ సినిమా టైం లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని. అది ప్రేమగా దారి తీసి పెళ్లిదాకా వెళ్లిందన్నారు. ఐతే సెట్ లోకి వెళ్లగానే ఫాహద్ పూర్తిగా మారిపోతాడని.. అప్పటివరకు బాగా పరిచయం ఉన్న తను అప్పుడు వేరేలా కనిపిస్తాడంటూ చెప్పుకొచ్చింది నజ్రియా. ఫాహద్ నటించిన జోజీ సినిమాలో చేసిన పాత్ర తనపై ఎంతో ప్రభావం చూపించిందన్నారు. అంతేకాదు ఫాహద్ చూడటానికి సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తాడు కానీ అతనెంత సరదా మనిషో ఒకసారి మాట్లాడితే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఫాహద్ నజ్రియా మళ్లీ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే కథ దొరికితే తప్పకుండా కలిసి నటించడానికి సిద్ధమంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నజ్రియా.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు