Trump Effect: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నిలకడ లేని నిర్ణయాలతో ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచానికి పెద్దన్నలా ముందు ఉండి నడిపించాల్సిన దేశం… ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎవరా సొంత పార్టీ నాయకులు, అసలు ట్రంప్ తీసుకున్న నిలకడ లేని నిర్ణయాలు ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్‌కు కేసులు కామనా..?
రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ..
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ. ఆమె ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె, ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతు తెలిపారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ, దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికలపై నిక్కీ హేలీ స్పందించారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోకూడదని పేర్కొన్నారు.
భారత్ చేయద్దా?.. చైనా చేయవచ్చా..!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా అని నిక్కీ హేలీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రష్యా నుంచి అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చి, భారత్ లాంటి బలమైన మిత్ర దేశంపై సుంకాలు విధించడం, పెంచిన ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు. నిన్న, మొన్నటి వరకు భారత్ తమ మిత్రదేశంగా పేర్కొన్న ట్రంప్, తాజాగా మాట మార్చేశారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారనే కారణంతో 25శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ టారిఫ్‌లను మరో 25 % పెంచారు. ఈ నేపథ్యంలో రష్యా భారత్‌కు మద్దతుగా నిలిచింది. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకు ఉంటుందని మాస్కో స్పష్టం చేసింది.
READ MORE: Film Federation: చిరంజీవి ఏం చెబితే అది వింటాం..!
