NTV Telugu Site icon

Devara : దేవర క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?

Devara

Devara

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కోరుట్ల శివ తెరకెక్కిస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న దేవర సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను అక్టోబర్ 10 దసరా కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

Read Also :Gangs Of Godavari : ఓటీటిలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈసినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.ఫియర్ సాంగ్ గా వచ్చిన ఆ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఆ సాంగ్ కు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ వుండనుందని సమాచారం.ఈ ట్విస్ట్ సెకండ్ పార్ట్ కు ఇంట్రో కానుందని సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి ,కొడుకు గా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.త్వరలోనే దేవర సెకండ్ సింగల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

Show comments