War 2 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం “దేవర” సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2 ” సినిమాలో కూడా నటిస్తున్నాడు.హృతిక్ ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Read Also :Varun Tej : ఆ దర్శకుడి క్రైమ్ కామెడీ స్టోరీకి ఓకే చెప్పిన వరుణ్ తేజ్..?
ఈ సినిమాను అయాన్ ముఖర్జీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.వార్ 2 సినిమా YRF స్పై యూనివర్స్ లో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ మూవీలో తన పాత్ర కోసం ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌తో రెండు వారాలపాటు ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఫైట్ మాస్టర్ అనల్ అరసు ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు. ఏ సినిమా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని,ఆ ఫైట్ సీక్వెన్స్ తానే రూపొందించినట్లు అనల్ అరుసు తెలిపారు.ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలువనున్నట్లు తెలిపారు.