NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రెండు భాగాలుగా రానుందా..?

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.

Read Also :Koratala Siva : మాస్ డైరెక్టర్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన దేవర టీం..

మేకర్స్ ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను మరో అద్భుత లోకానికి తీసుకెళ్తుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.దర్శకుడు నాగ్ అశ్విన్ ట్రైలర్ తోనే సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాడు. అయితే ఇప్ప్పుడు వస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి.అయితే కల్కి కూడా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది అనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ స్పందించేందుకు ఇష్టపడటం లేదు.అయితే ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుంది అని రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.మరి కల్కి క్లైమాక్స్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహించని ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి.

Show comments