Site icon NTV Telugu

Arvind Kejriwal: కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం.. రేపు ఏచూరితో కేజ్రీవాల్‌ భేటీ

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ రేపు (మంగళవారం) మధ్నాహ్నం సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేక పోరాటంలో మద్ధతివ్వాలని కోరనున్నారు. కేంద్ర ఆర్డినెన్స్‌ కు వ్యతిరేక పోరాటంలో భాగంగా కేజ్రీవాల్‌ ఇప్పటికే ఆదివారం తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిసి పోరాటంపై చర్చించారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో.. కేజ్రీవాల్‌ మంగళవారం సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ కానున్నారు.

Read Also: Disha patani: సమ్మర్‌లో హీటెక్కిస్తున్న దిశా పటాని

కలసివచ్చే ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్డినెన్స్ పై భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, కోల్‌కతా వెళ్లిన ఆయన.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కావడం.. ఆమె మద్దతు కూడా కోరిన విషయం విదితమే.. గత వారం రోజులుగా బీహార్‌ సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కె. చంద్రశేఖర్ రావులతో సమావేశమయ్యారు. ఎన్డీయేతర శక్తులను కూడగట్టి.. కేంద్రం ఆర్డినెన్స్‌పై పోరాటం ఉధృతం చేయాలని భావిస్తోన్న అరవింద్‌ కేజ్రీవాల్‌.. అందులో భాగంగా.. బీజేపీయేతర సీఎంలను, విపక్ష నేతలను కలుస్తూ వస్తున్నారు.

Exit mobile version