Shankar : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ,ప్రియా భవాని శంకర్ ,ఏస్.జె.సూర్య ,బాబీ సింహ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Passion : సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతున్న ‘పేషన్’ మూవీ..
ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో లాంచ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే అనిరుద్ అందించిన సాంగ్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు.విక్రమ్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినందుకు గాను కమల్ హాసన్ అనిరుద్ ని ఇండియన్ 2 సినిమా కోసం రెఫర్ చేసారు.అయితే ప్రస్తుతం అనిరుద్ అందించిన సాంగ్స్ అంత క్యాచీ గా లేవు.గతంలో వచ్చిన ఇండియన్ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఆ సినిమా అంతటి ఘన విజయం సాధించడానికి కారణం ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సాంగ్స్ అని చెప్పవచ్చు.అప్పట్లో ఆ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే పాటల విషయంలో ఎంతో కేర్ తీసుకునే శంకర్ ఇండియన్ 2 విషయంలో మిస్టేక్ చేసారా అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇండియన్ 2 విషయంలో శంకర్ మార్క్ మిస్ అవుతుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
