Site icon NTV Telugu

Wildlife Trafficking: విమానాశ్రయంలో పాముల కలకలం.. ముగ్గురు అరెస్ట్!

Snakes

Snakes

Wildlife Trafficking: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) కస్టమ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ అటవీ జీవాల రవాణాను అడ్డుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23) నాడు ముగ్గురు విదేశీ అటవీ జీవాలను అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, రాత్రి 1:30 గంటల సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ప్రయాణ బ్యాగుల్లో అనేక విదేశీ అరుదైన జంతువులు లభ్యమవడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

Read Also: Minister Kishan Reddy: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మిగిలేది గాడిది గుడ్డే

ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 303 ద్వారా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అధికారులు ఆపి తనిఖీ చేయగా.. వారి బ్యాగుల్లో అనేక అరుదైన విదేశీ జంతువులు ఉన్నట్లు బయటపడింది. దీనిపై కస్టమ్ శాఖ అత్యంత సీరియస్‌గా స్పందించి, అక్రమంగా తీసుకువస్తున్న ఈ అటవీ జీవాలను స్వాధీనం చేసుకుంది. వారి బ్యాగ్ ల తనిఖీ అనంతరం వివిధ రకాల పాములు, కీటకాలు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో 5 కార్న్ పాములు, 8 మిల్క్ పాములు , 9 బాల్ పైథాన్ పాములు, 4 బియర్డెడ్ డ్రాగన్ చిపకిళ్లు, 7 క్రెస్టెడ్ గెకో చిపకిళ్లు, 11 కామెరూన్ డ్వార్ఫ్ గెకో, మరో 14 కీటకాలు, ఒక పెద్ద సాలీడు కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Yadagirigutta: ఘనంగా మహా కుంభాభిషేకం.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు

కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అరుదైన అటవీ జీవాలను సంబంధిత అటవీ శాఖకు అప్పగించారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటువంటి అక్రమ రవాణా ప్రయత్నాలు గతంలో కూడా నమోదయ్యాయి. చాలా సార్లు బంగారం అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి సంఘటనలు వెలుగుచూశాయి. తాజా ఘటనలో అరుదైన అటవీ జీవాలను అక్రమంగా దేశంలోకి తేనికొని వచ్చిన ఈ ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

Exit mobile version