Site icon NTV Telugu

Elephant in park: చిల్డ్రన్స్‌ పార్క్‌లో సరదాగా ఆడుకుంటున్న ఏనుగు.. వీడియో వైరల్

Elephant

Elephant

Elephant in park: సోషల్‌ మీడియా ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన దృశ్యాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక జంతువులు చేసే చిత్ర విచిత్రమైన పనులు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోలు చూసినప్పుడు మనసుకు ఉల్లాసంగా, తేలికగా అనిపిస్తుంది. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంటాయి. ఇకపోతే, జంతువులను ఇష్టపడే వ్యక్తులు వాటికి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ వీడియో మీ మానసిక స్థితిని పూర్తిగా రిఫ్రెష్ చేస్తుంది. అలాంటి ఓ వీడియో తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఏనుగులు ఆడుతుంటూ ఉండే దృశ్యాలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడతారు. తాజాగా ఓ అడవి ఏనుగు పిల్లల పార్కులో ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమ్‌చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చిన అడవి ఏనుగు అస్సాం రాజధాని గౌహతిలోని నారంగి ఆర్మీ కాంట్‌లోని పిల్లల పార్కులో ఉన్న ఆట వస్తువులతో సరదాగా ఆడుతూ కనిపించింది. చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులతో ఆడుకుంటూ ఆ పార్కులో సరదాగా గడిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version