Site icon NTV Telugu

Wife Revenge: భర్తపై దాడి.. వైన్‌ షాప్‌ సిబ్బందిపై భార్య ప్రతీకారం..

Hyderabad

Hyderabad

Wife Revenge: భార్తను కొట్టే భార్యలను చూసాం.. భార్యలను కొట్టే భర్తను చూసే ఉంటాము. కానీ.. ఇప్పుడు ఓ భార్య గురించి చెప్తే నిర్ఘంగా పోవాల్సిందే. ఎందుకంటే చీటికి మాటికి పార్టీలనీ పబ్బులనీ మద్యం సేవిస్తూ ఉండే భర్తను మానేయాలని సలహాచెప్పే భార్యలను చూసే ఉంటాము. అంతేకాదు భర్త మందు మానకపోతే భర్తనే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయే భార్యలున్న ఈరోజుల్లో వైన్ షాప్ లో భర్త మందు అడిగితే కొట్టారనే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వైన్‌ షాప్‌ సిబ్బందిపైనే కాకుండా.. అడ్డొచ్చని పోలీసులపై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ లో చోటుచేసుకుంది.

Read also: Helicopter Stolen: ఆ నివేదికలు పూర్తిగా ‘తప్పుదోవ పట్టించేవి’.. భారత రక్షణ మంత్రిత్వ శాఖ..

మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. మద్యం కొనేందుకు అక్కడే వైన్‌ షాప్‌ వద్దకు వెళ్లి ఓ వ్యక్తి మద్యం ఇవ్వాలని అడిగాడు. దీంతో అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మద్యం అడిగిన వ్యక్తిపై వైన్‌ షాప్‌ సిబ్బంది దాడి చేశారు. ఆ వ్యక్తి తల పగల గొట్టి తీవ్రంగా గాయపరచారు. దీంతో భర్తను రక్తంతో చూసిన భార్య కాసేపు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వైన్‌ షాప్‌ సిబ్బందిని అడ్డుకున్నా ఎవరు మాట వినకపోవడం భర్తపై దాడి చేస్తుండటంతో భర్య రెచ్చిపోయింది. వైన్ షాపులోకి జొరబడి సిబ్బందిపై దాడికి దిగింది. మద్యం కొనేందుకు వచ్చిన నా భర్తపై దాడి చేస్తారా? అంటూ దాడికి చేసింది.

Read also: Kiara Advani: వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్నకియారా అద్వానీ…

అయితే స్థానిక సమాచారంతో వైన్‌ షాప్‌ దగ్గరకు చేరుకున్న పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ పోలీసులని చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టింది. దాడి చేసిన వారిపై కాకుండా నన్ను, నా భర్తను అడ్డుకుంటారా? నా భర్తపై తల పగిలేట్టు కొట్టినా మీకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తూ దాడికి దిగింది. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి. వైన్‌ షాప్‌ సిబ్బందితో దాడి, అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై దాడి చేసిన మహిళపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. వైన్‌ షాప్‌ సిబ్బంది మద్యం కొనేందుకు వచ్చని వ్యక్తిపై ఎందుకు దాడి చేశారు? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Pragya Jaiswal: అందానికి ఆధార కార్డుల మెరిసిపోతున్న అఖండ హీరోయిన్….

Exit mobile version