NTV Telugu Site icon

Extra-Marital Affair: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. భార్య ముందే ప్రియుడికి దేహశుద్ధి..!

Extra Marital Affair

Extra Marital Affair

Extra-Marital Affair: దారి తప్పిన భార్యకు బుద్ధి చెప్పాడు ఓ భర్త. ప్రియుడితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆమె ముందే ప్రియుడిని చితకబాదాడు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ వివాహిత తన పచ్చటి కాపురంలో చిచ్చుపెట్టుకుని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఉండగానే ప్రియుడితో ఎఫైర్ నడిపింది.. కానీ భార్యలో వచ్చిన మార్పులను గమనించిన భర్త.. ఆమె వివాహేతర సంబంధాన్ని గుర్తించి.. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భార్య ముందే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు.

Read Also: World Oldest Married Couple: 100 ఏళ్ల పెళ్లికొడుకు.. 102 ఏళ్ల పెళ్లి కూతురు.. పదేళ్ల నుంచి రిలేషన్షిప్‌లో

అసలేం జరిగిందంటే.. అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి సంతానం కూడా కలిగింది. ప్రశాంతంగా వారి జీవితం సాగిపోతుండగా.. ఆ వివాహిత తప్పుదోవ పట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్)లో ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంజనీరింగ్ యువకుడు ఇంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని ఆమె భర్త గమనించాడు. విచారించగా.. భార్య ఇంజనీరింగ్ యువకుడితో పెట్టుకున్న ఎఫైర్ గురించి తెలిసింది. ఈ క్రమంలో ఎలాగైనా వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారిద్దరూ కలుసుకునే స్థలం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ప్రియుడితో తన భార్య మాట్లాడడాన్ని గమనించాడు. భార్య వ్యవహారాన్ని అందరి ముందు బయటపెట్టి.. ఆమె ప్రియుడిని చితకబాదాడు. ఈ వ్యవహారాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.