NTV Telugu Site icon

Wife and Husband Fighting: రైల్వే స్టేషన్‌లో భార్యభర్తల మధ్య గొడవ.. ఇదేం పెళ్లాం రా బాబు

Wife And Husband

Wife And Husband

సంసారం అన్నాక గొడవలు రావడం సహజం. మనస్పర్థలు లేని భార్యాభర్తలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో మాటామాట అనుకుంటారు. చాలా సార్లు గొడవ ఇంట్లోని నాలుగు గోడలు దాటి బయటకు రాకుండా చూసుకుంటారు. మరీ పెద్ద సమస్య అయితే ఇంట్లో వాళ్లను పిలిచి వారితో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చూసుకుంటారు. ఇంకా పెద్దగా మారితే పంచాయితీలో తేల్చుకుంటారు. అంతేకానీ రోడ్డు మీద బహిరంగంగా గొడవపడే సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ అలా జరిగిన చాలా సందర్భాల్లో భర్తే భార్యను కొడుతూ, తిడుతూ కనిపిస్తాడు. ఈ మధ్యకాలంలో రోడ్డు మీద గొడవలు పడే సందర్భాలు కూడా ఎక్కువ అయిపోయి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం ఇప్పటి వరకు చూసిన అన్ని వీడియోల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ వీడియోలో ఓ భార్య తన భర్తను ఓ రేంజ్ లో కుమ్మేసింది. కిందపడేసి లేవకుండా తన్నింది. ఈ వీడియోను ఘర్ కా కాలేష్ అనే ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.దేశంలో జరుగుతున్న గొడవల నుంచి మనకు స్వాతంత్ర్యం కావాలి. అంతలో ఈ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను చూసి ఎంజాయ్ చేయండి అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియోలో భార్యభర్త ఏదో రైల్వేస్టేషన్ లో ఉన్నారు. భార్య కోపంగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటూ ఉంటుంది. భర్త ఆమెను ఏదో అంటూ ఉంటాడు. దీంతో ఆమెకు మండి ఒక్కసారిగా అతడి చెంప మీద కొడుతుంది. అంతటితో ఆగకుండా అతను ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే డబ్ల్యూడబ్ల్యూఈలో లాగా అతని కాళ్లు లాగి కింద పడేస్తుంది. తరువాత అతని పైకి ఎక్కి లేవకుండా తంతూనే ఉంటుంది. అతను కూడా ఆమె జుట్టు పట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మాత్రం అతనికి ఏ అవకాశం ఇవ్వకుండా అతని జుట్టుపట్టుకొని మరీ చేతులతో ఎలా పడితే అలా కొడుతుంది. ఇక ఆమె చేతిలో చావు దెబ్బలు తినడం తప్ప ఆ భర్తకు మరో అప్షన్ లేకుండా పోతుంది.

Also Read:Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జ‌న గ‌ణ మ‌ణ… వింటే గూస్ బంప్సే
అక్కడ ఉన్నవారు ఇది చూస్తూనే ఉన్నారు కానీ ఎవరూ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. చూడటానికి ఆ మహిళ బక్క పలుచగానే ఉన్నా ఆమె భర్త ఆమె నుంచి తప్పించుకొని పైకి లేవలేకపోయాడు.అక్కడ ఉన్న వారు ఎవరో వీడియో తీయడంతో వైరల్ అవుతుంది. అయితే ఈ గొడవ సద్దుమణిగిందో లేదో వీడియో తెలియదు.  ఈ వీడియో చూసిన వారు మొదట షాక్ అవుతున్నారు. దేవుడా పెళ్లాలు ఇలా కూడా ఉంటారా అంటూ భయపడుతున్నారు. ఇదేం పెళ్లాం రా బాబు దీనికో దండం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే భార్య భర్తను ఈ రేంజ్ లో కొట్టడం చూసి తెగ నవ్వుకుంటున్నారు. మరికొందరు వీరు రియల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.అంతేకాకుండా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇతనికి మాత్రం ఇంకా రాలేదు అంటూ అతని మీద జాలి చూసిస్తూ తమ సానుభూతిని చూపిస్తున్నారు నెటిజన్లు.

Show comments