NTV Telugu Site icon

Ishan Kishan: మూడు వన్డేలలో హాఫ్ సెంచరీ చేసినా.. హ్యాపీగా లేను: ఇషాన్‌ కిషన్‌

Ishan Kishan Bat Lift

Ishan Kishan Bat Lift

Ishan Kishan not so happy with his IND vs WI 3rd ODI Innings: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌.. మూడు వన్డేల్లోనూ 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొదటి వన్డేలో 46 బంతుల్లో 52 రన్స్ చేసిన ఇషాన్.. రెండో వన్డేలో 55 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. దాంతో ఆసియా కప్ 2023, ప్రపంచకప్‌ 2023 టోర్నీల జట్టు రేసులో ముందంజలో ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు.

వెస్టిండీస్‌పై కీలక ఇన్నింగ్స్‌లను ఆడినా తనకు మాత్రం హ్యాపీగా లేదని ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు. మ్యాచ్ అనంతరం ఇషాన్ మాట్లాడుతూ… ‘మూడో వన్డేలో నేను ఔటైన విధానం నాకే నచ్చలేదు. క్రీజ్‌లో పాతుకుపోయి మంచి పరుగులు చేస్తున్న సమయంలో ఔట్ అయ్యా. భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యా. క్రీజ్‌లో ఉండి భారీ స్కోర్లు చేయాలని సీనియర్లు కూడా ఎపుడూ చెబుతూ ఉంటారు. గత మ్యాచ్‌లో ఏం జరిగిందనేది మరిచిపోయి.. మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేయడం చాలా ముఖ్యం’ అని అన్నాడు.

Also Read: Nitin Chandrakant Desai Died: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య!

‘శుభ్‌మన్‌ గిల్ అద్భుత ప్లేయర్. బంతిని సరిగ్గా అంచనా వేసి ఆడటంలో దిట్ట. గిల్ క్రీజ్‌లో ఉండడం వల్ల నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇలాంటి కీలక మ్యాచుల్లో విజయం సాధించడం ఛాలా ఆనందంగా ఉంది. భారీ స్కోరు చేసిన తర్వాత విండీస్ వికెట్లను త్వరగా తీయాలని ముందే అనుకున్నాం. అందులో మేం సఫలమయ్యాం. ఈ పిచ్‌పై నేను చాలా టోర్నీలు ఆడా. బంతి ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. దాని గురించి ఇప్పుడేమీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా రాబోయే టోర్నీలపైనే. ఒకే ఒక్క టోర్నీ మన జీవితాన్ని మార్చేయగలదు’ అని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు.

Also Read: Beer Tanning: ‘బీర్ టానింగ్’ ట్రెండ్ అంటే ఏంటి.. వద్దంటూ నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?