Site icon NTV Telugu

India Map: భారత్ మ్యాప్‌లో ఆ దేశం ఎందుకు ఉంది.. కారణం తెలుసా?

Sri Lanka In India Map

Sri Lanka In India Map

India Map: ఇండియా మ్యాప్‌ను గమనించారా.. అందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూసి ఉంటే ఓకే.. లేదంటే ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఇంతకీ ఆ ఆసక్తికరమైన విషయం ఏంటని ఆలోచిస్తున్నారా.. అదే శ్రీలంక. ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఆసక్తికరంగా ఉండటం ఏంటని చూస్తున్నారా.. ఇది నిజంగా ఆసక్తికరమైనదే.. ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక దేశం మ్యాప్‌లో మరొక దేశం ఎందుకు ఉంటుందని.. మాకు అంత ఆలోచించే టైం లేదంటరా.. ఓకే ఓకే అలా ఎందుకు ఉందో ఇక్కడ చూద్దాం..

READ ALSO: Prabhas : దీపిక గురించి ప్రభాస్ ఏమన్నాడో తెలిస్తే అంతా షాక్..

శ్రీలంక ఎందుకు ఉంది..
భారతదేశం మ్యాప్‌లో మన సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు స్పష్టంగా కనిపించవు తెలుసు కదా.. కానీ ఒక దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.. అదే శ్రీలంక. ఎందుకు ఈ దేశం మన దేశం మ్యాప్‌లో కనిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.. ఎందుకంటే ఒక అంతర్జాతీయ చట్టం కారణంగా ఈ దేశం మన దేశం మ్యాప్‌లో కనిపిస్తుంది. ఇంతకీ ఈ అంతర్జాతీయ చట్టం ఏంటో తెలుసా..

‘లా ఆఫ్ ది సీ’తో మామూలుగా ఉండదు..
1958లో ఐక్యరాజ్యసమితి (UN) రూపొందించిన ‘లా ఆఫ్ ది సీ’ అనే అంతర్జాతీయ చట్టం కారణంగా భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక దేశం కనిపిస్తుంది. ఇంతకీ ఈ చట్టం ప్రత్యేకత ఏంటి, అసలు ఈ చట్టం ఏం చెబుతుందంటే.. ఒక దేశ సముద్ర సరిహద్దుకు 200 నాటికల్ మైళ్ల (సుమారు 370 కిలోమీటర్లు) లోపు ఏమైనా ఇతర దేశాలు ఉంటే వాటిని ఆ దేశం తమ మ్యాప్‌లో తప్పనిసరిగా చూపించాలి. ఇది రూల్..

భారతదేశం, శ్రీలంకల మధ్య ఎంత దూరం ఉందో తెలుసా.. కేవలం 18 నాటికల్ మైళ్లు. అంటే సుమారు 54.8 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 200 నాటికల్ మైళ్ల దూరం పరిధిలో ఉంది. అందుకే ఇండియా తన మ్యాప్‌లో కచ్చితంగా శ్రీలంక దేశాన్ని చూపిస్తుంది. మీకు తెలుసా.. ప్రపంచంలో మరే దేశం తన దేశం మ్యాప్‌లో పక్క దేశాన్ని చూపించలేదు. కానీ భారతదేశం మాత్రం ఈ నిబంధన కారణంగా.. తన దేశం మ్యాప్‌లో శ్రీలంకను చూపిస్తోంది. ఇది ఇండియా మ్యాప్‌లో శ్రీలంక కథ.

READ ALSO: Philippines Protests 2025: ఫిలిప్పీన్స్‌లో నేపాల్ నిరసనల ప్రకంపనలు.. రాజకీయ సంక్షోభం తప్పదా?

Exit mobile version