Russia Ukraine War: ఒకప్పుడు ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అందుటో ఒక ధృవం పేరు యూఎస్ఎస్ఆర్.. ఇది 1990 విచ్ఛిన్నం అయ్యింది. సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయ్యి చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 15 దేశాలుగా విడిపోయింది. భౌగోళిక విస్తీర్ణం పరంగా రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఇంతకీ మాస్కో పసి కూనపై ఎందుకు ఇంత పగ పట్టాల్సిన అవసరం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి అసలు కారణం ఏంటి. రష్యా ఎందుకు మిగతా 13 దేశాలపై ఆగ్రహంగా లేదు. కేవలం ఉక్రెయిన్‌పైనే ఎందుకు ఇంత కోసం.. ఆ దేశం చేసిన తప్పు ఏంటి.. అనేది ఈ స్టోరీలో చూద్దాం..
READ ALSO: Uttam Kumar Reddy : అంచనాలు లేనివేళ ఖర్చు లెక్కలు ఎలా..? హరీష్ రావు గణితం కొత్త మ్యాజిక్.!
మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చిన అమెరికా..
రష్యా మూడున్నర సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించింది. ఇది నేటికి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నించారు. ఆయన ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాలను రష్యాకు వదులుకుంటే కాల్పుల విరమణ జరుగుతుందనే ప్రకటన బయటికి రావడంతో యుద్ధ విరమణ ముందుకు కదల లేదు.
రష్యా ఎప్పుడూ ఉక్రెయిన్‌ను విడిగా గుర్తించలేదు..
ప్రస్తుతం రష్యా ఉక్రేనియన్ సైన్యాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తున్న ఐదు ప్రాంతాలు ఖార్కివ్, డోనెట్స్, లుహాన్స్, ఖెర్సన్, జాపోరిజ్జియా ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగం. 1991లో సోవియట్ యూనియన్ పతనంతో ఈ రెండు ప్రాంతాలు విడిపోయినప్పటికీ, రష్యా ఎప్పుడూ ఉక్రెయిన్‌ను విడిగా గుర్తించలేదు. రష్యా అనధికారికంగా క్రిమియా, తూర్పు ఉక్రెయిన్ను తనదిగా పరిగణించింది. ఈ ప్రాంతాలలో రష్యన్ మాట్లాడే, రష్యన్ అనుకూల జనాభా ఎక్కువగా ఉంది. ఇది మాస్కో వీటిని రష్యాలో కలుపుకోడానికి ఒక కారణం అయ్యింది.
రెండు దశాబ్దాల క్రితం.. సడన్ షాక్ ఇచ్చిన రష్యా
రెండు దశాబ్దాల క్రితం మాస్కో.. ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చింది. కీవ్ యూరోపియన్ యూనియన్‌కు దగ్గరగా వెళుతున్న సమయంలో మాస్కో దాడి చేసింది. మాస్కోతో సంబంధాలు కలిగి ఉన్న అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడిని అధికారం నుంచి తొలగించడాన్ని.. పాశ్చాత్య కుట్ర అని మాస్కో పేర్కొంది. దీంతో మాస్కో వెంటనే క్రిమియాపై దాడి చేసి స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి దానిని చుట్టుముట్టిన.. రష్యా అధికారికంగా ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. అనంతర కాలంలో రష్యన్లు మాట్లాడే, మాస్కోలో కలవడానికి ఇష్టపడే అనేక ప్రాంతాలలో పుతిన్ తన కార్యకలాపాలను పెంచారు. తర్వాత డాన్బాస్లో నిశ్శబ్ద యుద్ధం ప్రారంభమైంది. రష్యా వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడం, వారికి రష్యన్ ఆయుధాలు సమకూర్చడంతో పాటు, మాస్కో సైనికులు కూడా యూనిఫాంలు లేకుండా అక్కడికి రావడం ప్రారంభించారు. ఇప్పుడు డాన్బాస్ ఉక్రెయిన్లో ఉన్నప్పటికీ, అది క్రమంగా పూర్తిగా రష్యన్ అనుకూల ప్రాంతంగా మారింది.
2022లో ఉక్రెయిన్‌ను చుట్టు ముట్టిన రష్యా..
ఫిబ్రవరి 2022లో రష్యా అకస్మాత్తుగా ఉక్రెయిన్‌పై అన్ని వైపుల నుంచి దాడి చేసింది. మొదట ఉక్రెయిన్ వెంటనే లొంగిపోతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చాలా కాలంగా రష్యా- ఉక్రెయిన్ పోరు కొనసాగుతోంది. ఇంతలో తమ సైన్యం అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా పేర్కొంది. ఇప్పుడు ప్రధానంగా సాగే చర్చ ఏమిటంటే రష్యా నుంచి విడిపోయిన మరో 13 దేశాలు ఉన్నాయి.. కానీ మాస్కో ఒక ఉక్రెయిన్‌నే ఎందుకు టార్గెట్ చేసింది అని. రష్యాకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌తో చారిత్రక సంబంధం ఉంది. కైవ్ రష్యన్ జాతీయ, సాంస్కృతిక గుర్తింపుకు మూలంగా పరిగణిస్తారు. దీంతో మాస్కోలో ఎవరు అధికారంలో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా, వారు ఉక్రెయిన్‌ను తమలో విచ్ఛిన్నమైన భాగంగా పరిగణించడం కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా వాళ్లు అప్పుడప్పుడు దానిని తిరిగి తమ దేశంలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తారు.
మాస్కోకు ప్రధాన ముప్పు..
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాలు యూరోపియన్ యూనియన్లో చేరాయి. అవి EU, NATO రెండింటిలోనూ సభ్య దేశాలుగా అయ్యాయి. అయితే ఈ దేశాలు చిన్నవి కాబట్టి రష్యా వాటిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించలేదు. అలాగే అవి అప్పటికే NATO అనే గొడుగు కిందికి వెళ్లడం కూడా మరో కారణం. దీంతో మాస్కో మౌనంగా ఉంది. మిగిలిన అనేక దేశాలు రష్యాతోనే ఉన్నాయి. ఇక్కడ ఉక్రెయిన్ విషయానికి వస్తే అది పరిమాణంలో పెద్దది, అలాగే ఈ దేశంలో సమృద్ధిగా వనరులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశం రష్యా – యూరప్‌ల మధ్య బఫర్ జోన్‌గా పనిచేస్తుంది. ఒక వేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే, అమెరికన్, యూరోపియన్ దళాలను రష్యా పశ్చిమ సరిహద్దులో నేరుగా మోహరించవచ్చు. ఇది మాస్కోకు ప్రధాన ముప్పు. దీంతో ఉక్రెయిన్ పశ్చిమ శిబిరంలో చేరకుండా రష్యా అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది..
READ ALSO: Americans Oppose Trump: పాపం ట్రంప్.. అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేక స్వరం
