Why Indians Don’t Win Nobel: సర్ సి.వి.రామన్ తర్వాత మరో భారతీయుడు సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా వైద్యం)లో నోబెల్ బహుమతిని గెలుచుకుని దాదాపుగా 95 ఏళ్లు అయ్యింది. 1930లో సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఇది ఒక భారతీయ శాస్త్రవేత్తకు లభించిన ఏకైక గౌరవం. ఇక్కడ విశేషం ఏమిటంటే భారత సంతతికి చెందిన మరో ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే వాళ్లు భారతీయ పౌరులు కాదు. సి.వి.రామన్ తర్వాత ఒక్క భారతీయుడు కూడా గత 95 ఏళ్లలో నోబెల్ బహుమతిని ఎందుకు గెలుచుకోలేకపోయారు.
READ ALSO: Botsa Satyanarayana: బొత్స కుటుంబానికి తృట్టిలో తప్పిన ప్రమాదం!
భారతదేశంలో అనేక సవాళ్లు..
భారతదేశంలో శాస్త్రీయ, పరిశోధన సామర్థ్యాల అభివృద్ధికి అనేక ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. ఇవి శాస్త్రీయ ప్రతిభను పూర్తిగా వికసించకుండా నిరోధిస్తున్నాయి. భారతదేశంలో పరిశోధనలకు ప్రభుత్వ నిధులు సరిపోవు, దీంతో పరిశోధన మందగిస్తుంది. ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు. తాజాగా దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో కూడా పరిశోధన సామర్థ్యాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఈ సవాళ్ల నేపథ్యంలో దేశంలో చాలా తక్కువ సంస్థలు మాత్రమే అత్యాధునిక పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. భారతదేశంలో జనాభాతో పోలిస్తే పరిశోధకుల సంఖ్య ప్రపంచ సగటు కంటే ఐదు రెట్లు తక్కువ. అందుకే నోబెల్ బహుమతి వంటి ప్రధాన గౌరవాలను గెలుచుకునే సామర్థ్యం ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు భారతదేశంలో చాలా తక్కువగా మంది ఉన్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.
నామినేట్ అయినా వరించని నోబెల్..
సి.వి.రామన్ తర్వాత దేశం నుంచి సైన్స్ రంగంలో నోబెల్ బహుమతికి మరెవరూ పోటీ పడలేదా అంటే.. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు. వీరిలో కొందరు శాస్త్రవేత్తలు అద్భుతమైన శాస్త్రీయ విజయాలు కూడా సాధించారు. కానీ ఎప్పుడూ నోబెల్‌ను గెలవలేదు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అవార్డులకు నామినేషన్లు 1970 వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్యశాస్త్రంలో అవార్డులకు నామినేషన్లు 1953 నాటివి. ప్రజా నామినేషన్ జాబితాలో చేర్చిన సుమారు 35 మంది భారతీయులలో ఆరుగురు శాస్త్రవేత్తలు ఉన్నారు. మేఘనాథ్ సాహా, హోమీ భాభా, సత్యేంద్ర నాథ్ బోస్ భౌతిక శాస్త్రానికి నామినేట్ కాగా, జి.ఎన్. రామచంద్రన్, టి.శేషాద్రి రసాయన శాస్త్రానికి నామినేట్ అయ్యారు. వైద్య శాస్త్రానికి నామినేట్ అయిన ఏకైక భారతీయుడు ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి. ఈ ఆరుగురు వేర్వేరు నామినేటర్లచే అనేకసార్లు నామినేట్ అయ్యారు. ఆ కాలంలో భారతదేశంలో నివసించి పనిచేసిన కొంతమంది బ్రిటిష్ శాస్త్రవేత్తలు కూడా నామినేషన్ జాబితాలలో కనిపిస్తారు.
అద్భుతమైన ఆవిష్కరణలు.. అయినా దక్కని నోబెల్ గౌరవం
చాలా మంది భారతీయ శాస్త్రవేత్తలకు అద్భుతమైన కృషి ఉన్నప్పటికీ, నోబెల్ బహుమతి గౌరవం ఇవ్వకుండా తిరస్కరించారు. ఇది వివాదాస్పదం అయ్యింది. జగదీష్ చంద్రబోస్ నోబెల్ బహుమతిని అందుకోకపోవడం ఒక పెద్ద లోపం. ఆయన 1895లో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తి. అయితే 1909లో గుగ్లిఎల్మో మార్కోనీ, ఫెర్డినాండ్ బ్రాన్ బోస్‌లకు ఇదే పనికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని వచ్చింది. అలాగే వృక్ష శరీరధర్మ శాస్త్రంలో బోస్ చేసిన కృషి కూడా చాలా ముఖ్యమైనది. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ నోబెల్ అవార్డుకు నామినేట్ కాలేదు. భారతదేశం నుంచి కె.ఎస్. కృష్ణన్ నోబెల్ బహుమతికి బలమైన హక్కును కలిగి ఉన్న మరొక శాస్త్రవేత్త. కానీ ఆయన్ను ఎప్పుడూ కూడా నోబెల్ కమిటి గౌరవించలేదు. ఆయన సి.వి. రామన్ ప్రయోగశాలలో ఆయన విద్యార్థిగా, సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనను రామన్ ఎఫెక్ట్ సహ-ఆవిష్కర్తగా పరిగణిస్తారు. ఈ ఆవిష్కరణకు రామన్‌కు 1930లో నోబెల్ బహుమతి లభించింది. కానీ కృష్ణన్ ఎప్పుడూ కూడా తన ఆవిష్కరణలతో నోబెల్‌కు నామినేట్ కాలేదు.
రెండుసార్లు తిరస్కరణకు గురైన సుదర్శన్..
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి E.C.G. సుదర్శన్ ఒకసారి కాదు, రెండుసార్లు (1979, 2005లో) తిరస్కరణకు గురయ్యారు. ఈక్రమంలో సుదర్శన్ భారతదేశాన్ని వదిలి 1965లో US పౌరుడు అయ్యారు. తర్వాత ఆయన ముఖ్యమైన పరిశోధనలు చాలావరకు USలో జరిగాయి. ఆయన 2018లో మరణించారు. ఘన-స్థితి రసాయన శాస్త్రంలో సి.ఎన్.ఆర్.రావు చేసిన కృషి చాలా కాలంగా నోబెల్ బహుమతికి అర్హమైనదిగా పరిగణించబడుతోంది. కానీ ఆయనకు కూడా ఈ గౌరవం లభించలేదు.
భారీ నిధులు సమకూర్చుతున్నా.. అవార్డులు అంతంతే..
చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలలో శాస్త్రీయ పరిశోధనలకు భారీగా నిధులు సమకూరుతున్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా విషయం ఏమిటంటే ఈ దేశాలకు సైన్స్‌లో నోబెల్ బహుమతులు తక్కువగా ఉన్నాయి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా వైద్యంలో 653 మంది నోబెల్ బహుమతి గ్రహీతలలో 150 మందికి పైగా యూదులు ఉన్నారు. అయితే యూదుల మాతృభూమిగా పరిగణిస్తున్న ఇజ్రాయెల్ సైన్స్‌లో ఇప్పటి వరకు కేవలం నాలుగు నోబెల్ బహుమతులను మాత్రమే గెలుచుకుంది. వాటిని కూడా రసాయన శాస్త్రంలో మాత్రమే గెలుచుకుంది. సైన్స్, టెక్నాలజీలో ఒక దేశం సామర్థ్యాలను కొలవడానికి ఉపయోగించే అన్ని సాధారణ సూచికలలో ఇజ్రాయెల్ చాలా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఇది నోబెల్ బహుమతుల విషయంలో మాత్రం ఈ దేశం ప్రతీసారి వెనుకబడిపోతుంది.
భారత్ వెనకబాటుకు కారణాలు..
భారత్‌తో పోల్చితే అమెరికా, యూరప్‌లలో పరిశోధన, అభివృద్ధి వాతావరణం ప్రత్యేకమైనది. ఇతర దేశాలతో పోలిస్తే, శాస్త్రీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో లేదా పరిశోధన నిధులను కేటాయించడంలో భారతదేశం చాలా వెనకబడి ఉంది. చైనా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాల కంటే ఇండియా పరిశోధనలకు కేటాయించే నిధుల జాబితా చాలా వెనుకబడి ఉంది. శాస్త్రీయ పరిశోధన కోసం బలమైన పర్యావరణ వ్యవస్థ, తగినంత ప్రభుత్వ మద్దతు లేకుండా, భవిష్యత్తులో భారతదేశం మరిన్ని నోబెల్ బహుమతులు గెలుచుకునే అవకాశాలు చాలాచాలా తక్కువ.
సైన్స్‌లో నోబెల్ బహుమతులలో అమెరికా, యూరప్ ఆధిపత్యం..
అమెరికా, యూరప్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలకు పెద్ద సంఖ్యలో సైన్స్‌లో నోబెల్ బహుమతులు వరించాయి. వీరిలో చాలామంది మెరుగైన శాస్త్రీయ మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థల కోసం ఇతర దేశాల నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వలస వచ్చారు. భౌతిక శాస్త్రంలో బహుమతిని గెలుచుకున్న 227 మందిలో 13 మంది, రసాయన బహుమతిని గెలుచుకున్న 197 మందిలో 15 మంది, వైద్యశాస్త్రంలో బహుమతిని గెలుచుకున్న 229 మందిలో 7 మంది మాత్రమే ఆసియా, ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా నుంచి వచ్చారు. వాస్తవానికి ఉత్తర అమెరికా, యూరప్ వెలుపల, కేవలం తొమ్మిది దేశాలలో మాత్రమే సైన్స్‌లో నోబెల్ బహుమతులు గెలుచుకున్న పరిశోధకులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో జపాన్ నుంచి వచ్చిన వారు 21 నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు.
READ ALSO: IPS Officer Suicide: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. పాపం ఏం కష్టం వచ్చిందో..
