Site icon NTV Telugu

Malayalam- Tollywood: మలయాళ నుండి టాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాల్సింది ఇదేనా..!

F Malayalam Cinema In 2026

F Malayalam Cinema In 2026

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు భారీ బడ్జెట్‌లు, స్టార్ హీరోలు, ఏళ్ల తరబడి షూటింగ్‌లు జరుపుకుంటున్న పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడుతుంటే.. మరోవైపు అతి తక్కువ బడ్జెట్‌తో, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న మలయాళ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు మలయాళ ఇండస్ట్రీ సక్సెస్ మంత్రం ఏంటి? మనవాళ్లు నేర్చుకోవాల్సింది ఏముంది?

Also Read : Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?

ముందుగా చెప్పాలి అంటే మలయాళ దర్శకులు గ్రాండియర్ (Grandeur) కంటే రియలిజంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి కథలు చాలా సాధారణంగా, మన పక్కింట్లో జరిగినట్లుగా ఉంటాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు లేదా విదేశాల్లో షూటింగ్స్ కంటే.. మనిషిలోని ఎమోషన్స్, సమాజంలోని చిన్న చిన్న అంశాలను వారు అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఈ ‘ఆథెంటిసిటీ’ (Authenticity) ఇప్పుడు కేవలం కేరళకే కాదు, ఓటీటీ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనెక్ట్ చేస్తోంది. అలాగే మలయాళ సినిమాల మేకింగ్ విషయంలో కూడా చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. తెలుగులో ఒక సినిమా తీయడానికి 200 నుంచి 300 రోజులు తీసుకుంటుంటే.. మలయాళంలో 40 నుండి 60 రోజుల్లో నాణ్యమైన అవుట్‌పుట్ ఇస్తున్నారు. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ఉండటం వల్ల బడ్జెట్ పెరగదు, నిర్మాత నష్టపోడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వారు బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచడం వల్ల చిన్న సినిమా కూడా పెద్ద లాభాలను తెచ్చిపెడుతోంది.

ఒకప్పుడు మలయాళ సినిమాలు ఓటీటీలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కూడా మలయాళ సినిమాలకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టార్ క్రేజ్ లేదా హైప్ కంటే ‘మౌత్ టాక్’ మీద వారు ఎక్కువ ఆధారపడతారు. సినిమా బాగుందనే చిన్న టాక్ వస్తే చాలు.. నెమ్మదిగా మొదలై వారం గడిచేసరికి వసూళ్ల వర్షం కురుస్తోంది. మాలీవుడ్ ఎప్పుడూ ఒకే ఫార్ములాకు పరిమితం అవ్వదు. ఒకవైపు పక్కా మాస్ సినిమాలు తీస్తూనే, మరోవైపు కంటెంట్ డ్రివెన్ సినిమాలు తీస్తారు. ఈ సమతుల్యత (Balance) వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు. ప్రతి వారం ఏదో ఒక కొత్త రకమైన సినిమా వస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించారు.

Exit mobile version