Malayalam- Tollywood: మలయాళ నుండి టాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాల్సింది ఇదేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు భారీ బడ్జెట్‌లు, స్టార్ హీరోలు, ఏళ్ల తరబడి షూటింగ్‌లు జరుపుకుంటున్న పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడుతుంటే.. మరోవైపు అతి తక్కువ బడ్జెట్‌తో, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న మలయాళ సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు మలయాళ ఇండస్ట్రీ సక్సెస్ మంత్రం ఏంటి? మనవాళ్లు నేర్చుకోవాల్సింది ఏముంది?
Also Read : Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?
Also Read
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ముందుగా చెప్పాలి అంటే మలయాళ దర్శకులు గ్రాండియర్ (Grandeur) కంటే రియలిజంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి కథలు చాలా సాధారణంగా, మన పక్కింట్లో జరిగినట్లుగా ఉంటాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు లేదా విదేశాల్లో షూటింగ్స్ కంటే.. మనిషిలోని ఎమోషన్స్, సమాజంలోని చిన్న చిన్న అంశాలను వారు అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఈ ‘ఆథెంటిసిటీ’ (Authenticity) ఇప్పుడు కేవలం కేరళకే కాదు, ఓటీటీ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనెక్ట్ చేస్తోంది. అలాగే మలయాళ సినిమాల మేకింగ్ విషయంలో కూడా చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. తెలుగులో ఒక సినిమా తీయడానికి 200 నుంచి 300 రోజులు తీసుకుంటుంటే.. మలయాళంలో 40 నుండి 60 రోజుల్లో నాణ్యమైన అవుట్‌పుట్ ఇస్తున్నారు. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ఉండటం వల్ల బడ్జెట్ పెరగదు, నిర్మాత నష్టపోడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వారు బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచడం వల్ల చిన్న సినిమా కూడా పెద్ద లాభాలను తెచ్చిపెడుతోంది.
ఒకప్పుడు మలయాళ సినిమాలు ఓటీటీలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కూడా మలయాళ సినిమాలకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టార్ క్రేజ్ లేదా హైప్ కంటే ‘మౌత్ టాక్’ మీద వారు ఎక్కువ ఆధారపడతారు. సినిమా బాగుందనే చిన్న టాక్ వస్తే చాలు.. నెమ్మదిగా మొదలై వారం గడిచేసరికి వసూళ్ల వర్షం కురుస్తోంది. మాలీవుడ్ ఎప్పుడూ ఒకే ఫార్ములాకు పరిమితం అవ్వదు. ఒకవైపు పక్కా మాస్ సినిమాలు తీస్తూనే, మరోవైపు కంటెంట్ డ్రివెన్ సినిమాలు తీస్తారు. ఈ సమతుల్యత (Balance) వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు. ప్రతి వారం ఏదో ఒక కొత్త రకమైన సినిమా వస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించారు.
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!