NTV Telugu Site icon

Sri RamaNavami 2024: రాముడి కల్యాణం తర్వాత పానకంనే ఎందుకు ఇస్తారు ?

Prasadam

Prasadam

శ్రీరామనవమి పండుగ గురించి అందరికీ తెలుసు.. హిందువులు ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు.. అలాగే శ్రీరామనవమికి కూడా రాముడికి ఎంతో ఇష్టమైన పానకంను నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు.. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో.. ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పెడతారు..

ఉగాది నుంచి చలి పూర్తిగా తగ్గిపోయి వేడి రోజురోజుకు పెరుగుతుంది. అందుకే శ్రీరామనవిమికి తాటాకు పందిళ్ళు వేస్తారు.. పానకం ప్రసాదంగా ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. పానకంలో వేసే బెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందులోనే ఐరన్ కూడా ఉంటుంది. అలాగే మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి. శొంఠి వల్ల దగ్గు రాకుండా ఉంటుంది.. ఇవన్నీ కలిసిన పానకంను తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది.

రామ చంద్రుడికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు, యాలుకలు కూడా వేస్తారు. రామనవమి రోజున రాములవారిని ముఖ్యంగా తులసీదళంతోనే పూజిస్తారు. తులసి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది… వీటి వల్ల వైరస్ వల్ల వచ్చే వ్యాధులు వెంటనే తగ్గుతాయి.. ఈ పానకంను రోజూ తాగరు.. వేసవి ఆరంభంలోనే ఈ పండుగ రోజు మాత్రమే తాగుతారు.. అందుకే నైవేద్యంగా పంచుతారని పురాణాలు చెబుతున్నాయి..