NTV Telugu Site icon

Earth – Moon: భూమికి ఒకే చంద్రుడు ఎందుకు ఉన్నాడు..? కారణం ఇదే..

Earth And Moon

Earth And Moon

Earth – Moon: మన సౌరకుటుంబంలో సూర్యుడే అన్నింటికి ఆధారం. గ్రహవ్యవస్థలోని 8 గ్రహాలు కక్ష్యలో తిరగడానికి సూర్యుడి గ్రావిటీనే కారణం. మన సౌరకుటుంబంలో సూర్యుడితో అధిక పరిమాణం. కొన్ని గ్రహాలు సూర్యుడి లాగే తన సొంత వ్యవస్థను కలిగి ఉంటాయి. ఉదాహరణకు శని, గురు గ్రహాలు వందల సంఖ్యలో ఉపగ్రహాలను కలిగి ఉన్నాయి. మన భూమి కూడా చంద్రుడిని కలిగి ఉంది. అయితే, శని, గురు, యూరెనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలు పదుల సంఖ్యలో ఎందుకు చంద్రులను కలిగి ఉన్నాయి..? భూమి ఎందుకు ఒకే చంద్రుడిని కలిగి ఉంది..? అనే సందేహం ఒక్కోసారి మనకు వస్తుంది.

అయితే, సాధారణంగా గ్రహాలకు ఉపగ్రహాలు ఏర్పడటం సౌరవ్యవస్థ ఏర్పడిన సమయంలో జరిగిందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇదిలా ఉంటే ఒక గ్రహం చంద్రుడు లేదా మరేదైన ఉపగ్రహాలను తన చుట్టు తిప్పుకోవాలంటే ముందుగా ఆ గ్రహానికి ‘‘హిల్ స్పియర్ రేడియస్’’ అనేది ఉండాలి. ఒక గ్రహం ఎంత పెద్దదిగా ఉంటే అంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దీనిపైనే ఉపగ్రహాలను ఆకర్షించి, తన చుట్టూ తిప్పుకునే శక్తి ఆధారపడి ఉంటుంది.

Read Also: Puneeth Rajkumar: పునీత్ ఆత్మతో మాట్లాడిన స్వామీజీ.. కుమార్తె కడుపున పుడతానంటూ!

హిల్ స్పియర్ రేడియస్:

ఒక గ్రహం కక్ష్యలో తన ఉపగ్రహానప్ని ఉంచడానికి కనీస దూరాన్ని ‘‘హిల్ స్పియర్ రేడియస్’’ అని అంటారు. హిల్ స్పియర్ వ్యాసార్థం పెద్ద వస్తువు మరియు చిన్న వస్తువు రెండింటి ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. మన సౌరవ్యవస్థనే చూసుకుంటే, అన్ని గ్రహాలు కలిసినా కూడా సూర్యుడి పరిమాణానికి సాటిరావు. దీంతో ప్రతీ గ్రహంపై సూర్యుడి ‘‘గురుత్వాకర్షణ’’ పనిచేస్తుంటుంది. దీని వల్లే సూర్యుడి చుట్టూ భూమితో సహా 8 గ్రహాలు తిరుగుతున్నాయి. అయితే, మన భూమి-చంద్రుడిని పరిశీలిస్తే భూమికి చంద్రుడు దగ్గర ఉండటం, చంద్రుడిపై భూమి గ్రావిటీ గరిష్టంగా ఉంటడంతో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఒకవేళ భూమి హిల్ స్పియర్ వ్యాసార్థంలోనే చంద్రుడు ఉన్నాడు. ఒక వేళ దీన్ని దాటి ఉంటే చంద్రుడు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు.

బుధుడు, శుక్రుడు వంటి చిన్న గ్రహాలు తక్కువ ‘ హిల్ స్పియర్ వ్యాసార్థాన్ని’’ కలిగి ఉంటాయి. దీంతో ఒక వేళ వీటికి చంద్రులు ఉన్నా కూడా, సూర్యుడి గురుత్వాకర్షణ వల్ల లాగబడే అవకాశం ఉంటుంది. అందుకే వీటికి ఉపగ్రహాలు లేవు. ఇక అంగాకరకుడికి ఫోబోస్, డిమోస్ అనే రెండు చిన్నచిన్న చంద్రులు ఉన్నారు. వీటి పరిమాణం చాలా చిన్నవి, ఇవి అంగారకుడి ‘‘హిల్ స్పియర్’’ పరిధిలోనే ఉన్నాయి. అంగారకుడి దగ్గరగా ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి ఇవి తప్పిపోయి, అంగారకుడి గురుత్వాకర్షణ ప్రభావంతో ఉపగ్రహాలుగా మారాయనే సిద్ధాంతాలు ఉన్నాయి.

Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియేకి ఎదురుదెబ్బ.. ఇజ్రాయిల్ దాడిలో 10 మంది కుటుంబీలకు మృతి..

చంద్రుడి పుట్టుక:

సౌరకుటుంబం ఏర్పాటు సమయంలో వాయుగోళాలు, దమ్ము వంటి పదార్థాలు సూర్యుడి చుట్టూ తిరుగుతు కాలక్రమేణా గ్రహాలుగా ఏర్పడ్డాయి. అదే సమయంలో గ్రహాలకు ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. చాలా సందర్భాల్లో ఇలానే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇతర పరిణామాలు ఉపగ్రహాల ఏర్పాటుకు కారణం అవుతుంది. ఉదాహరణకు చంద్రుడి పుట్టుకు గురించి పరిశీలిస్తే, అంగారకుడి సైజు ఉన్న ఒక గ్రహం, భూమిని ఢీకొట్టడం వల్ల భూమిలోని కొంతభాగం చంద్రుడిగా మారాడనే సిద్ధాంతం ఉంది.

ఇక ఇతర గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలు చాలా పెద్దవి, ఇవి భూమి, అంగారకుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్దవిగా ఉంటాయి. బృహస్పతికి 95 చంద్రులు ఉండగా, శనికి 146 ఉన్నాయి. ఈ గ్రహాలు సూర్యుడికి దూరంగా ఉంటాయి, దీంతో సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కూడా ఎక్కువ ఉపగ్రహాలు ఉండేందుకు కారణం. ఇలాంటి గ్రహాల పుట్టుక సమయంలోనే చాలా వరకు చంద్రులు ఏర్పడుతారు. అయితే వీటి పరిమాణం పెద్దది కావడంతో వీటికి ఎక్కువ ‘‘హిల్ స్పియర్ రేడియస్’’ ఉంటుంది. దీంతో ఇవి ఎక్కువ ఉపగ్రహాలను కలిగి ఉంటాయి. భూమి పరిమాణం దృష్ట్యా చంద్రుడి వంటి ఒకే ఉపగ్రహానికి పరిమితమైంది. గ్రహం పరిమాణం, దాని గురుత్వాకర్షణ, హిల్ స్పియర్ రేడియస్ వంటివి ఒక గ్రహానికి ఎన్ని చంద్రులు ఉండాలనే విషయాన్ని ప్రభావితం చేస్తాయి.