Site icon NTV Telugu

Chiranjeevi – Euphoria: ‘యుఫోరియా’లో మెగాస్టార్? గౌతమ్ మీనన్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ చిరంజీవినే!

Chiranjeevi Rejected Euphoria

Chiranjeevi Rejected Euphoria

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్ కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘చూడాలని ఉంది’ చిత్రం అప్పట్లో సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా, టెక్నికల్‌గా తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. అయితే, వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుణశేఖర్ రీసెంట్‌గా తెరకెక్కించిన యూత్ ఫుల్ థ్రిల్లర్ ‘యుఫోరియా’ (Euphoria) లో చిరంజీవి ఒక కీలక పాత్రలో కనిపించాల్సి ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాత్ర ఏమిటి? మెగాస్టార్ దాన్ని ఎందుకు వదులుకున్నారు? అనే ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Also Read : Hombale Films : మ్యూజిక్ రంగంలో హోంబలే కొత్త అడుగు.. ‘శివ శంభో స్వయంభూ’ ప్రోమో అదిరిపోయింది!

దర్శకుడు గుణశేఖర్ ఈ మధ్య కాలంలో తన రూట్ మార్చి, నేటి తరం ఆడియన్స్‌‌కు నచ్చేలా ‘యూఫోరియా‘ అనే ప్రయోగాత్మక సినిమా రూపోందించారు. ఇందులో కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్ర కోసం గుణశేఖర్ మొదటి ఛాయిస్ మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవినే. అవును మీరు విన్నది నిజం. అయితే మొదట గుణశేఖర్ మీద ఉన్న నమ్మకంతో ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించిన, తర్వాత ప్రస్తుతం ఇమేజ్, లైనప్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గారట. తాను ఇప్పుడు పూర్తిస్థాయి మాస్ హీరోగా సినిమా చేస్తున్న సమయంలో ఇలాంటి సహాయక లేదా అతిథి తరహా పాత్రలు చేస్తే అభియానులు ఎలా స్వీకరిస్తారో అన్న చిన్న సందేహంతో ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ తర్వాత ఆ పాత్రలోకి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వచ్చి అద్భుతంగా నటించారు.

Exit mobile version