డిసెంబర్ నెల వచ్చేసింది. ఈ ఏడాది అత్యంత భారీగా ఎదురు చూసిన సినిమాల్లో ఒకటి ‘అవతార్ 3 – ఫైర్ అండ్ అష్’. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ఈ సిరీస్ మూడో భాగం డిసెంబర్ 19న విడుదల కానుంది. అయితే ఆశ్చర్యకరంగా, భారత్‌లో ఈ సినిమాకు పూర్వ భాగాలతో పోలిస్తే అంతగా హైప్ కనిపించడం లేదు. ఈ తక్కువ బజ్ వెనుక ఉండే ప్రధాన కారణాం అవతార్ 1 – 2 ఇచ్చిన మిశ్రమ అనుభవం అని చెప్పాలి. 2009లో వచ్చిన మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి, సినిమాటిక్ విజువల్స్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. అందుకే 2022లో విడుదలైన అవతార్ 2 (ఫైర్ అండ్ వాటర్) పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. అవతార్ 2కి ఇండియాలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.
వసూళ్లు నిలవలేదు వర్డ్ ఆఫ్ మౌత్ ఆశించినంత ఫలితం రాలేదు. 3D విజువల్స్ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేదని చాలా మంది భావించారు. ఫలితంగా, ప్రేక్షకుల్లో అవతార్ ఫ్రాంచైజీపై ఉన్న క్రేజ్ కొంత తగ్గిపోయింది. ఇక అవతార్ 3 ప్రమోషన్స్ విషయానికి వస్తే.. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ప్రమోషనల్ మెటీరియల్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొంతమంది సినిమా లుక్ చూసి.. “ఇది అవతార్ 2 కి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లా కనిపిస్తోంది కొత్తది ఏముంది?” అని కామెంట్ చేస్తున్నారు.
కథలో కొత్త కోణం కనిపించకపోవడం, కొత్త కాన్సెప్ట్‌లు లేకపోవడంతో ఫ్రాంచైజీకి కావాల్సిన హైలెట్స్ తగ్గిపోవడం.. వీటన్నింటి వల్ల ఇండియన్ ఆడియెన్స్‌లో పెద్ద హైప్ జనరేట్ కావడం లేదని అనిపిస్తోంది. మరి అవతార్ 3 విజయం సాధిస్తుందా? అనేది జేమ్స్ కామెరూన్ తీసుకొస్తున్న కొత్తదనం మీద ఆధారపడి ఉంటుంది. అవతార్ యూనివర్స్‌లో కొత్త సీక్వెన్స్‌లు,భిన్నమైన తెగలు, టెక్నాలజీ,బలమైన భావోద్వేగాలు, ఒరిజినల్ విజువల్ అని మూవీలో బలంగా కనెక్ట్ అయితే, సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే ఇండియాలో వసూళ్లు కూడా ఇంతకు ముందు అవతార్ లా రేంజ్ చూపించకపోవచ్చు.
