NTV Telugu Site icon

White Snake Viral Video: వైట్ స్నేక్‌ను ఎప్పుడైనా చూశారా?.. భలే ముద్దుగా ఉందే!

White Snake Viral Video

White Snake Viral Video

White Snake Viral Video Goes Viral: తరచుగా మనం పాములను చూస్తూనే ఉంటాం. చాలామంది ఎక్కువగా నల్లటి పాములను చూస్తుంటారు. చాలా అరుదుగా మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండే ఆములవాస పాము మనకు కనబడుతుంది. వైట్ కలర్ స్నేక్ కూడా ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఆగ్నేయ ఆసియాలో ఉంటాయి. తాజాగా వైట్ స్నేక్‌ను సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read: MS Dhoni Angry: ధోనీ కోపాన్ని నేను చూశా.. ఒక్కసారిగా బయపడిపోయా: బద్రీనాథ్

‘tetamzcute’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో వైట్ స్నేక్‌ను సంబందించిన వీడియోను పోస్ట్ చేశారు. పచ్చటి గడ్డిలో వైట్ స్నేక్‌ పరుగులు పెడుతోంది. పచ్చ గడ్డిలో ఈ పాము ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఓ దగ్గర ఆగిఉన్న పాము.. పైకిలేచి చూస్తోంది. ఈ వీడియో సోషల్ నెట్టింట వైరల్ కాగా.. లైకుల వర్షం కురుస్తోంది. ‘భలే ముద్దుగా ఉందే’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో అరుదైన జాతికి చెందిన పాములు ఎక్కువగా ఉంటాయి. అక్కడ నదులు, అడవులు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం.

Show comments