Site icon NTV Telugu

Viral Wedding : వరమాల మార్చుకునే శుభవేళ.. కలకలం రేపిన డ్రోన్..!

3

3

ప్రస్తుతం పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ కి తగట్టు పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నారు చాలా మంది. ప్రస్తుతం వివాహల ట్రెండ్‌ పూర్తిగా మారింది. పెళ్లిళ్లలో కొత్తకొత్త టెక్నాలజీలని ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ మధ్య కొందరు పెళ్లిళ్ల సమయంలో జయమాల సమయంలో డ్రోన్‌ లతో తీసుక రావడం కామం గా మారింది. తాజాగా ఇలాంటి పెళ్లి తంతుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Viral: అయ్యయో.. తల్లి, పిల్లాడు రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. చివరికి..?!

ఈ వీడియోలో కల్యాణ వేదిక పైకి ఓ డ్రోన్ రావడంతో అక్కడ ఒక చిన్నపాటి ప్రమాదం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన ఈ వీడియోలో, వేదికపై వధూవరులు వరమాల కోసం వేచి ఉన్నారు. ఇంతలోనే అక్కడికి ఓ డ్రోన్ దండతో వారి పైకి వస్తుంది. దాంతో వరుడు కాస్త డ్రోన్ నుండి వేలాడుతున్న దండను తీయడానికి ప్రయత్నించడం చేస్తాడు. కాకపోతే ఇంతలోనే ప్రమాదం జరిగింది.

Also Read: Viral Video: శివ శివ.. అంటూ శివునికే నామం పెట్టిన దొంగ..!

ఆ వరుడు డ్రోన్‌ నుండి దండను తీయడానికి దందాను పట్టుకోగా, డ్రోన్ రెక్క వేదికపై ఉన్న పూలతో ఢీకొని అదికాస్తా క్రాష్ అయినట్లు వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. అలా జరిగిన సమయంలో డ్రోన్ కూలిపోవడంతో వరుడికి అతి దగ్గరగా పడింది. అదృష్టం కొద్ది అక్కడ ఎవరూ గాయపడలేదు. ఈ వైరల్‌ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల స్పందనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఒకవేళ చిన్న పొరపాటు జరిగి ఉంటే, వధూవరులకు వేదిక పైనే గాయాలు అయ్యేవని ఒకరంటే.. చిన్నతనంలో రిమోట్ కంట్రోల్డ్ కార్లని కూడా సరిగ్గా నడపని వారు ఇప్పుడు డ్రోన్‌ లను చేత్తో పెట్టుకుని తిరుగుతున్నారని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version