తమిళ హీరో విజయ్ అంటోని బిచ్చగాడు సినిమాతో స్టార్ హీరోగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. ఇటీవల లవ్ గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది.. తమిళ్ వెర్షన్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది.. తెలుగు వర్షన్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది..
తెలుగులో అయితే అసలు చాలా మందికి ఈ సినిమా వచ్చినట్లు కూడా తెలియదు. ఇప్పుడీ మూవీ ఆహా తమిళం, ప్రైమ్ వీడియో ఓటీటీల్లోకి వచ్చేసింది. మే 10 నుంచి ఈ రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ మరియు ఆహా దక్కించుకున్నాయి.. తమిళ్ ఓటీటీలో ఓ మాదిరిగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..
ఈ మూవీకు వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. భార్య మనసు గెలిచేందుకు ప్రయత్నించే భర్త పాత్ర చేశారు విజయ్ ఆంటోనీ. ఆయన సరసన ఈ చిత్రంలో మృణాళిని రవి నటించారు.. యోగి బాబు,సుధ, తలైవాసల్ విజయ్ తదితరులు సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.. అక్కడ ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా ఇక్కడ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి..
