NTV Telugu Site icon

Kalki 2898 AD : ఎక్కడ చూసిన ‘కల్కి’ మయమే..ఈ సారి మరింత భారీగా..?

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి కారును దేశంలో ప్రధాన నగరాలలో తిప్పుతూ కల్కి సినిమాపై మేకర్స్ సూపర్ బుజ్ క్రియేట్ చేస్తున్నారు.

Read Also :Kanchana 4: ‘కాంచన 4’ లో నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ జూన్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరింత భారీగా నిర్వహించి ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో భారీగా బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్సు బుకింగ్ మొదలయింది.భారీ స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్సు బుకింగ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు పోటీగా ఎలాంటి పెద్ద సినిమా కూడా రిలీజ్ కావడం లేదు.దీనితో ఈ సినిమాను భారీగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.సింగల్ స్క్రీన్స్ ,మల్టీప్లెక్స్ అన్ని థియేటర్స్ లో కల్కి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.90 శాతం థియేటర్స్ లో కల్కి సినిమా రిలీజ్ కానుందని సమాచారం.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Show comments