Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News When Is The Release Date Of Inti No 13 Movie Lock

Inti Number 13 : మార్చి 1న ‘ఇంటి నెం. 13’… ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు వస్తున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌..

NTV Telugu Twitter
Published Date :February 19, 2024 , 3:48 pm
By Swathi Maddula
Inti Number 13 : మార్చి 1న ‘ఇంటి నెం. 13’… ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు వస్తున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి హారర్‌ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని ఏర్పరుచుకున్నారు పన్నా రాయల్‌. మార్చి 1న రిలీజ్‌ అవుతున్న ‘ఇంటి నెం.13’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిఫరెంట్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో పన్నా రాయల్‌ హ్యాట్రిక్‌ కొడతారని చిత్ర యూనిట్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.

రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. డిఫరెంట్‌గా ఉన్న టైటిల్‌.. అంతే డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్‌ ఆడియన్స్‌లో సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. మార్చి 1న రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ‘ఇంటి నెం.13’ రిలీజ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను దర్శకుడు పన్నారాయల్‌ వివరిస్తూ.. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌ ఎన్నో హారర్‌ సినిమాలు చూశారు. వాటికి పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఈ సినిమాలోని మిస్టరీ, సస్పెన్స్‌ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి. సినిమాలో ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు. హారర్‌ జోనర్‌లో ‘ఇంటి నెం.13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది. టెక్నికల్‌ వేల్యూస్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్‌ అని చెప్పొచ్చు. ఈ తరహా సినిమాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేయించాం. ఈ సినిమాకి మరో ప్లస్‌ పాయింట్‌ వినోద్‌ యాజమాన్య మ్యూజిక్‌. తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాడు. సబ్జెక్ట్‌ విపరీతంగా నచ్చడం వల్ల ఔట్‌పుట్‌ అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాత హేసన్‌ పాషాగారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఒక మంచి ప్రొడక్ట్‌ని బయటికి తెచ్చారు. మేం అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది’’ అన్నారు.

నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ .. పన్నా నాకు ఏదైతే చెప్పారో దాన్ని యాజిటీజ్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశారు. ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్‌ చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. అతని గత చిత్రాలను ఎంత బాగా తీసారో వాటిని మించేస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1న ఈ డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తారని అన్నారు.

నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌, ఎడిటింగ్‌: సాయినాథ్‌ బద్వేల్‌, కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పన్నా రాయల్‌, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Inti number 13
  • latest news
  • movie updates
  • release date lock

తాజావార్తలు

  • Kubera : కుడి ఎడమైందే..!

  • Droupadi Murmu: బర్త్‌డే రోజు వేదికపైనే కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్..

  • CM Omar Abdullah: ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ అంశంపై విపక్షాలపై సీఎం ఆగ్రహం..!

  • New Traffic Rules: త్వరలో హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ!

  • PM Modi: అంబేద్కర్‌ను మేము హృదయంలో పెట్టుకున్నాం.. మీరు పాదాల కింద పెట్టుకున్నారు..!

ట్రెండింగ్‌

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions