NTV Telugu Site icon

Lufthansa plane: లుఫ్తాన్స్ విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్

Pleane

Pleane

మ్యూనిచ్‌కు చెందిన లుఫ్తాన్స్ వైడ్ బాడీ ఏ 380 విమానం టైర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ చాకచక్యంగా ఢిల్లీ విమానాశ్రాయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ప్రమాద సమయంలో 490 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: India Tour of Zimbabwe: జింబాబ్వే పర్యటనకు వెళ్లని శుభ్మన్ గిల్.. కారణమిదే..?

టైర్‌లో మంటలు చెలరేగినా.. విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులు భద్రతే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. మ్యూనిచ్‌కు తిరుగు ప్రయాణంలో మరమ్మత్తుల కారణంగా ప్రయాణం రద్దు చేసినట్లు వెల్లడించారు. ల్యాండింగ్ సమయంలో ఒక చక్రంలో మంటలు వచ్చినట్లు తెలిపారు. జూలై 3న ఢిల్లీ నుంచి మ్యూనిచ్‌కు విమానం విమానాన్ని నడపనున్నట్లు లుఫ్తాన్స్ ప్రతినిధి తెలిపారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ.. ఎందుకో తెలుసా..?