1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51, 760లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,00లుగా ఉంది.
2. మరోపోరుకు సిద్ధమైన భారత మహిళల క్రికెట్ జట్టు. నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ20 మ్యాచ్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్.
3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును నేడు కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు.
4. నేడు నిజాంసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు నీటిని విడుదల చేయనున్న అధికారులు.
5. నేడు కడపలో వైసీపీ మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ జాబ్ మేళాకు 13వేల మంది నిరుద్యోగులు హాజరుకానున్నారు. అంతేకాకుండా ఈ జాబ్‌మేళాలో 120కిపైగా కంపెనీలు పాల్గొననున్నాయి.
6. నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్. మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్‌పీఓలు సేకరించిన ధాన్యం ఆన్‌లైన్‌లో విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం.
7. నేడు కరీంనగర్‌లో పర్యటించనున్న మంత్రి గంగుల కమాలాకర్. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు.
8. నేడు వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ హోం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.