1. నేడు మునుగోడుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు.
2. నేడు హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 18, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 రైళ్లను రద్దు చేసింది.
3. నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది 3 విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు అధికారులు.
4. నేడు పలాసాలో నారా లోకేష్ పర్యటించనున్నారు.
5. నేడు తెలంగాణలో హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
6. నేడు విజయవాడలో బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర జరుగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ పాల్గొననున్నారు.
7. నేడు తిరుపతిలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. నాలుగో విడత జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.
8. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. రామగుండం, చొప్పదండి ఎమ్మెల్యేల ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.
