Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం. మంత్రులు, 33 జిల్లాల అధ్యక్షులతో భేటీకానున్న సీఎం కేసీఆర్‌. జాతీయ పార్టీపై చర్చించనున్న సీఎం కేసీఆర్‌.

2. నేడు భారత్‌-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌. గౌహతి వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌. 3 టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌. గాయం కారణంగా సిరీస్‌కు బుమ్రా దూరం. బుమ్రా స్థానంలో సిరాజ్‌కు చోటు.

3. నేడు శ్రీశైలంలో ఏడో రోజు దసరా మహోత్సవాలు. సాయంత్రం కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం. గజవాహనంపై పూజలందుకోనున్న స్వామి, అమ్మవార్లు. రాత్ర కన్నుల పండువగా ఆదిదంపతుల గ్రామోత్సవం.

4. నేడు మహాత్మాగాంధీ 153వ జయంతి. దేశవ్యాప్తంగా గాంధీజయంతి వేడుకలు.

5. నేడు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్‌. మధ్యాహ్నం 3గంటలకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌. జగన్‌ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.

6. నేడు ట్యాంక్‌బండ్‌పై సండే-ఫండే కార్యక్రమం. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం. బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు.

7. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,730 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.62,000 లుగా ఉంది.

Exit mobile version