* నేటి నుంచి ఢిల్లీలో జీ 20 సదస్సు.. 9, 10 తేదీల్లో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు.. జీ 20 అధ్యక్ష హోదాలో ఈ సదస్సు నిర్వహిస్తోన్న భారత్ .
* ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో రెండు రోజుల పాటు అత్యంత కట్టుదిద్దమైన భద్రత మధ్య ఈ సదస్సు నిర్వహణ.
* ఇండియా తొలి సారిగా అధ్యక్ష హోదాలో జీ20 సదస్సుకు ఆతిథ్యం.. ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే జీ20 సదస్సుపై భారీ అంచనాలు..
* దక్షిణార్ధ గోళ దేశాల ఆందోళనలు, రష్యా-ఉక్రెయిన్ యుద్దంతో నెలకొన్న దారుల పరిస్థితులు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థకు పరిష్కారం చూపుతూ.. ఈ సదస్సును కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం.
* జీ20 దేశాలైన ఇండియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఈ సదస్సులో పాల్గొంటాయి. అధ్యక్ష హోదాలో ఇండియా.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్ దేశాలను ఆహ్వానించింది.
* ఈరోజు ఉదయం 6 గంటలకు చంద్రబాబు అరెస్ట్.. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీసు ఇచ్చిన సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్.. చంద్రబాబు బాబుపై 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, red with 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు
* ఎఫ్‌ఐఆర్ నేదు.. నోటీసు లేదు.. ఏదో జరిగిందని కేసులు పెడుతున్నారు.. స్కిల్స్ స్కామ్ కేసులో నా పేరు ఎక్కడ ఉందో చూపించండి.. ప్రాథమిక ఆధారాలు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు-చంద్రబాబు
* విజయవాడ మూడో ACM కోర్టుకు చంద్రబాబును తీసుకువచ్చే అవకాశాలు..
* రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు.. టీడీపీ నాయకులు బయటకు రాకుండా పోలీసుల మోహరింపు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా : రాజోలులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బస చేస్తున్న క్యాంపు వద్ద భారీగా పోలీసులు మోహరింపు.. కిలో మీటర్ దూరం వరకు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా బారికెట్లు ఏర్పాటు.. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
