Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* రేపు, ఎల్లుండి ఢిల్లీలో జీ20 సమావేశాలు.. ఇవాళ భారత్‌కు చేరుకోనున్న అగ్రదేశాల అధినేతలు.. జీ 20 సమావేశాలకు హాజరవుతున్న 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, WHO ప్రతినిధులు.. ఢిల్లీలో మొదలయిన ట్రాఫిక్ ఆంక్షలు

* తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన.. నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

* హైదరాబాద్‌ : నేటి నుంచి టీఎస్‌ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్.. అందుబాటులో ఎంబీఏలో 22,843 సీట్లు, ఎంసీఏలో 3,042 సీట్లు

* ఎంబీబీఎస్‌ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడగింపు.. ఈ రోజు సాయింత్రం వరకు గడువు పొడిగించిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ.

* ప్రకాశం : మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం వీధిలో ఉన్న ఉట్ల మండపంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం..

* ప్రకాశం : గిద్దలూరు మండలం ముండ్లపాడులో సయ్యద్ మియా స్వామి 41రోజుల జార్తుల మహోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు..

* ప్రకాశం : ఒంగోలు మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ రాంకింగ్ టోర్నమెంట్.. హాజరుకానున్న పలువురు క్రీడాకారులు..

* ప్రకాశం : ఒంగోలు లార్డ్ కృష్ణ అకాడమీలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీ..

* తిరుమల: ఇవాళ మాడవీధులలో ఉట్లోత్సవం.. ఈ రోజు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు.. వెంకటాచలం మండలాల్లో తిరిగి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం.. శ్రీఅష్టలక్ష్మి సమేత కృష్ణ మందిరంలో శ్రావణ శుక్రవార పూజలు

* నెల్లూరు: వెంకటగిరిలో నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

* పశ్చిమ గోదావరి: పాలకొల్లు నియోజకవర్గం నుంచి కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్ర.. మధ్యాహ్నం కలగంపుడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. చించినాడ బ్రిడ్జిపై నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశం..

* అనంతపురం : ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్తెద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల మారథాన్ .

* తిరుమల: కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత.. ట్రాప్ కెమరాల ద్వారా మరో రెండు చిరుతల సంచారాని గుర్తించిన అటవీశాఖ అధికారులు.. స్పెషల్‌ టైప్ క్వార్టర్స్ సమీపంలో ఒకటి.. నరశింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నరట్టు గుర్తింపు.. రెండు చిరుతలను ట్రాప్ చేసేందుకు ఏర్పాట్లు చేసిన అటవీశాఖ అధికారులు.. ఇప్పటికే ఐదు చిరుతలను ట్రాప్ చేసిన అధికార్లు

* నంద్యాల : నేడు బనగానపల్లె, నంద్యాలలో చంద్రబాబు పర్యటన.. బనగానపల్లెలో టీడీపీ మహిళా శక్తి హామీలపై మహిళలతో చంద్రబాబు ముఖాముఖి, టీడీపీ శ్రేణులతో సమావేశం.. నంద్యాల రాజ్ థియేటర్ సర్కిల్ వద్ద చంద్రబాబు బహిరంగ సభ

* పశ్చిమగోదావరి జిల్లా: తణుకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

* విశాఖ: నేడు సిటీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఐదు రోజుల పర్యటనలో ఆంధ్రా యూనివర్శిటీ కాన్వెకేషన్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్

* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం.. చంద్రవతి కళ్యాణ మండపంలో మహిళలతో వరలక్ష్మీ వ్రతం.. పాల్గొననున్న 500 మంది చెంచు గిరిజన మహిళలు, 500 మంది సాధారణ మహిళ భక్తులు

* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. పెంటపాడు మండలంలోని యానాలపల్లి , పరిమల్ల గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

* నేటి నుంచి 3 రోజుల పాటు సంగారెడ్డి జిల్లాలో SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న SFI జాతీయ అధ్యక్షుడు వీపీ సాను

* హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 5గంటలకు కావ్య కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్ పేట 6 నంబర్‌ వద్దనున్న మహారాణా ప్రతాప్ పంక్షన్ హాల్ లో “సామూహిక వరలక్ష్మి వ్రతం “.. హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Exit mobile version